కుల దురహంకారంతో ప్రేమ పెళ్లి ఇష్టం లేక అబ్బాయిని కిరాయి హంతకుల చేత చంపించిన తండ్రిఈ హంతకులకు ఏ శిక్ష వేయాలి ? ప్రేమ పక్షులపై కక్ష గట్టి.... వెదికి పట్టుకుని వేటాడి చంపిన మానవ మృగాలను ఎట్లా శిక్షించాలి ? మొన్న ప్రణయ్ అమృత కేసు నేడు హేమంత్, అవంతి కేసు కుల రక్కసి విసిరిన వేటుకు విగతులై విల విలా తల్లాడిన ప్రేమ జంటలు..ఈ విశాదాంత విరహ గీతికి ముగింపు పాడెదెపుడు...


మిర్యాలగూడకు చెందిన  ప్రణయ్,  అమృత ప్రేమ కథ విశాద గాధ మరువక ముందే హైదరాబాద్ లో జరిగిన మరో ప్రేమ జంట విశాదం ఇది.  ప్రేమ వివాహం ఇష్టం లేని అమ్మాయి తండ్రి అబ్బాయిని కిరాయి హతకులను  ఉపయోగించి చంపించి శవాన్ని పొదల్లో పడేపించాడు. చందానగర్ కు చెందిన హేమంత్  అవంతి అనే యువతి 8 నెలలక్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిరువురిని అవంతి మేన మామతో పాటు తండ్రి తరుపు  భందువులు నమ్మించి కారులో కిడ్నాప్ చేసి తీసుకు వెళుతుండగా అవంతి మార్గ మద్యంలో తప్పించుకుంది. అవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వెదుకుతుండగానే  హేమంత్ ను చిత్ర హింసల పాలు చేసి చంపి  సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో పడేసారు.  గచ్చిబౌలి పోలీసులు  హేమంత్‌ మృతదేహాన్ని కనుగొని హైదరాబాద్‌కు తరలించారు.


హేమంత్‌ కుమార్‌ హత్యకేసులో మొత్తం 13మందిని అదుపులోకి చేసినట్లు మాదాపూర్‌ ఇన్‌ఛార్జ్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులను వైద్య పరీక్షలు నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ హేమంత్‌ హత్యకేసులో అవంతి మేనమామ యుగంధర్‌ రెడ్డి ప్రధాన నిందితుడని వెల్లడించారు. హేమంత్‌ తల్లిదండ్రులు ఫోన్‌ చేయగానే తాము స్పందించామని, అతడి ఆచూకీ కోసం అన్ని విధాలా ప్రయత్నించామని చెప్పారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు