ట్రంప్ పై లైంగిక ఆరోపణలు చేసిన మాజీ మోడల్‍ అమీ డోరిస్‍

 
అమెరికా అద్యక్షులు డోలనాల్డ్ ట్రంప్ ను లైంగిక వేధింపుల ఆరోపణలు వెంటాడుతున్నాయి.  ఆయన అద్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు కొనసాగుతున్నాయి. తాజా మరోసారిబరిలో నిలిచి ఎ్ననికల ప్రచారంలో దూసుకు వెళుతున్న ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువడ్డాయి. మాజీ మోడల్‍ అమీ డోరిస్‍ ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఇరవై మూడేళ్ళ క్రితం... అంటే... 1997 లో యూఎస్‍ ఓపెన్‍ టెన్నిస్‍ టోర్నమెంట్‍ సందర్భంగా న్యూయార్క్ లోని  వీఐపీ సూట్‍లో ఉన్న ట్రంప్‍.. తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు.

ట్రంప్... తనను బలవంతంగా ముద్దుప్టెట్టుకోవడమే కాకుండా, గట్టిగా హత్తుకుని శరీరమంతా అసభ్యకరంగా తాకాడని డోరిస్‍ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పుడు తనకు 21 ఏళ్ళుంటాయని చెప్పారు. కాగా... అప్పుడు ట్రంప్‍ వయస్సు 51 ఏండ్లు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అంతేకాదు... డోరిస్‍ ఆరోపణలు... విపక్షాలకు కల్సి వచ్చే అవకాశం లేక పోలేదు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు