దళిత యువకుడి శిరోమడనం కేసులో నూతన నాయుడు అరెస్ట్
ఫేక్ కాల్ తో దొరికి పోయిన నూతన నాయుడు

దళిత యువకుడి శిరోమండనం కేసులో ఫరారీలో ఉన్న బిగ్ బాస్ ఫేం నూతన నాయుడును పోలీసులు అరెస్ట్ చేసారు. కర్ణాటకలోని ఉడిపిలో నూతన్ నాయుడును అరెస్ట్ చేసిన కర్నాటక పోలీసులు కోర్టులో హాజరు పరచగా రిమాండ్ చేసారని సీపీ మనీశ్ కుమార్ సిన్హా వెల్లడించారు.  నూతన నాయుడును తమకు అప్పగించాలని కోర్టును కోరినట్లు కమీషనర్ తెలిపారు.   విశాఖలోని నూతన్ నాయుడు నివాసంలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియ, మరో ఆరుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు.
పోలీసులకు చిక్కకుండా ఫరారీలో ఉన్న నూతన నాయుడు మాజి ఐఏఎస్ అధికారి పీవి రమేశ్ పేరుతో డాక్టర్ సుధాకర్ కు మరికొందరు పోలీసు అధికారులకు ఫోన్ కాల్స్ చేశాడు. డాక్టర్ సుధాకర్ పేక్ కాల్ విషయంపై పివి రమేశ్ తో మాట్లాడి నిర్దారించుకోగా పివి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నూతన నాయుడు దొరికి పోయాడు. కర్ణాటకలో ని ఉడిపిలో ఉన్న నూతన నాయుడును ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు