భారత్ బయోటెక్ సందర్శించిన గవర్నర్ - శ్రమిస్తున్న సైంటిస్టులను అభినందించిన గవర్నర్

 20202 లోనే కోవిడ్ 19 వాక్సిన్ వస్తుంది - గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
2020 లోనే కోవాగ్జిన్ రావచ్చని అశాభావం


కోవిడ్ 19 ను ఎదుర్కునేందుకు భారత ఫార్మా ధిగ్గజం భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వాక్సిన్ త్వరలో అందుబాటు లోకి వస్తుందని రాష్ర్ట గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం  గవర్నర్ శామీర్ పేటలో ఉన్న భారత్ బయోటెక్ ను సందర్శించి కోవాగ్జిన్ తయారి పురోగతులపై సైంటిస్టులతో మాట్లాడారు. కోవాగ్జిన్ తయారీలో స్వయంగా పాల్గొన్న సైంటిస్టులు గవర్నర్ కు వాక్సిన్ గుణగణాలను వివరించారు. కోవాగ్జిన్ ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ వాక్సిన్ తయారు చేసేందుకు సైంటిస్టులు ఎంతో శ్రద్దతో కృషి చేస్తున్నారని గవర్నర్ అభినందించారు.  ప్రదాన మంక్రి నరేంద్ర మోది చెప్పినట్లు మన దేశంలో వాక్సిన్ తయారీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భారత్ బయోటిక్ రుజువు చేయబోతోందని అన్నారు.  వాక్సిన్ ప్రయోగాలలో అన్ని సవ్యంగా జరుగుతున్నాయని 2020 సంవత్సరం లోనే కోవాగ్జిన్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు.. కోవిడ్ మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడేందుకు అహర్నిశలూ కష్ట పడుతున్న సైంటిస్టులకు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చానని గవర్నర్ చెప్పారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు