పాటకు మరణం లేదు - బాలు నీకు జోహార్లు



ప్రపంచ తెలుగు ప్రజలను తన గాత్ర మాధుర్యంతో మైమరపించిన గాన గంధర్వుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి మరణం సంగీత లోకానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారికివే మా నివాళులు.

ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం ఇక లేరనే నిజం జీర్ణించుకోలేని భాద. గాన ప్రపంచంలో తన తైన ముద్ర వేసి మహోన్నత శిఖరాలకెదిగిన బాలు పాట చిర్మరణీయం. ఆయన పాట అజరామరం...ఐదు దశాబ్దాల పాటుగా తెలుగు పాటను ఓలలాడించిన ఎస్పి బాలసుబ్రమణ్యం ప్రయాణం ముగిసినా ఆయన రాగం తాళం పల్లవి మనకు శాశ్వతంగా వదిలి  పోయాడు.  కరోనా పాజిటి వ్ తో గత నెల రోజులుగా జజీవన్మరణ పోరాటం చేసిన బాలు శుక్రవారం మద్యాహ్నం తుది శ్వాస విడిచాడు.

ఆయన మరణం పట్ల పపలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోది, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు సిని ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

బాలు అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఆయన బౌతిక కాయం మద్రాస్ లోని కోడంబాక్కం లో గల ఆయన ఇంటికి చేర్చారు.శనివారం ఉదయం వరకు ఇంటి వద్దనే పెట్టి, అభిమానుల సందర్శనార్థం సత్యం థియేటర్ కు తీసుకువెళ్లనున్నారు. మధ్యాహ్నం తరువాత నగర శివారు రెడ్ హిల్స్ లోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు