భారత చైనా.. సరిహద్దులో కమ్ముకున్న యుద్ధమేఘాలు



సరిహద్దిలోని తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవాధీనరేఖ అవతల చైనా  భారీ ఎత్తున యుద్ద ట్యాంకులను, సైనికులను మోహరింపజేసింది దాంతో బారత్, చైనా  సరిహద్దులో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి.

వాస్తవాధీనరేఖకు 20 కిలోమీటర్ల దూరంలో వీటిని మోహరించింది. దక్షిణ ప్యాంగాంగ్ లోని  మాల్డో ప్రాంతంలో మన సైనికులకు కనిపించేంత దూరంలో చైనా బలగాలు ఉన్నాయనిభారత మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

చైనాకు ధీటుగా ఏ పరిస్థితులైనా ఎదుర్కునేందుకు ఇండియా సంసిద్దంగా ఉంది. ఇండియన్ ఆర్మీ ముందు జాగ్రత్తగానే చైనా వ్యూహాన్ని ఎప్పటి కప్పుడు ఓ కంట కనిపెడుతూ  కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలోకి అదనపు ట్యాంకులను పంపి  సైన్యాన్నిమోహరింప చేసింది. మన బలగాలు, ట్యాంకులు సైతం ఎత్తైన ప్రాంతంలో ఉంటూ, చైనా నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. చైనా ట్యాంకుల దాడిని ఎదుర్కొనేందుకు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, రాకెట్స్ తో పాటు పలు రకాల ఆయుధాలతో మన సైనికులు రెడీగా ఉన్నారు. అప్ గ్రేడెడ్ టీ-72ఎం1 ట్యాంకులతో పాటు, మిస్సైల్స్ ను ఫైర్ చేయగలిగిన హెవీ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ టీ-90లను ఎల్ఏసీ వద్ద మోహరింపజేశారు. ఇవన్నీ కూడా హై ఆల్టిట్యూడ్ ఏరియా (ఎత్తైన ప్రాంతాలు)లపై ఉండి, శత్రువులపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇరు దేశాల సైన్యం మోహరించిన విధానాన్ని చూస్తే... మనల్ని చైనా ఢీకొనే పరిస్థితి లేదు. అయినప్పటికీ, చైనా దూకుడుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తోంది. చైనా సైన్యం మొత్తం మన ఆయుధాల రేంజ్ లోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మంచు పర్వతాల మధ్య మనతో చైనా సైనికులు పోటీ పడలేరని చెప్పారు. ఇదే సమయంలో చైనా ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగడం గమనార్హం. ఎల్ఏసీకి అవతల చైనా ఎయిర్ యాక్టివిటీ ఎక్కువగా కనపడుతోంది. చైనా దేశీయంగా తయారు చేసిన సుఖోయ్-30 యుద్ధ విమానాలు టిబెట్ ప్రాంతంలోని రెండు ఎయిర్ బేస్ ల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. తద్వారా మన ఎయిర్ ఫోర్స్ కు సవాల్ విసిరే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ నరవాణే మాట్లాడుతూ, సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని స్పష్టం చేశారు. టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పారు. మన వైపు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని... ఎల్ఏసీ పొడవునా అవసరమైన అన్ని చోట్ల బలగాలను, ఆయుధాలను మోహరింపజేశామని తెలిపారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు