జపాన్ లో పెద్ద లను గౌరవించే పండుగ -100 ఏళ్ళు పై బడిన వారికి అధికారిక సత్కారాలు

 పెద్దల గౌరవార్దం జపాన్ లో ఓ పెద్ద పండగే నిర్వహిస్తారు
ప్రభుత్వం అధికారికంగా జ్ఞాపికలు అంద చేసి వారిపట్ల గౌరవం ప్రకటిస్తుంది

భారత దేశంలో పితృదేవతలకు పండుగ చేయడం ఆచారం. ప్రత్యేకంగా పితృమాసంలో పితృదేవతలను స్మరించి  వారి పేరిట పూజలు పునస్కారాలు దాణ ధర్మాలు చేయటం వంటి కార్య క్రమాలు నిర్వహిస్తారు.  కాని  జపాన్ లో కూడ ఇలాంటి  విధానం ఉంది కాని అక్కడ పెద్దలు బతికి ఉండగానే ప్రతి ఏటా పండగ ఘనంగా నిర్వహిస్తారు. వయస్సు పై బడిన పెద్దలకు ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో పెద్దల పండగ నిర్వహిస్తారు.  భారత దేశంలో పితృమాసం దాదాపు సెప్టెంబర్ లోనే వస్తుంది. జపాన్ లో నిర్వహించే పెద్దల పండగను 1966 లో జపాన్  ప్రారంభించింది.

జపాన్ఈ లో పెద్దోల్ల పండగను ఆనంద సోమవారం - Keiro No Hi  గా పిలుస్తారు. ప్రభుత్వం  అధికారికంగా పండగను జరిపించి పెద్దలకు జ్ఞాపికలు అంద చేస్తుంది. ఆ రోజును సెలవు రోజుగా  ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.చాలాకాలం సెప్టెంబర్ 15 నాడు ఈ పండుగ జరుపుకునే వారు. కానీ 2013 నుంచి జపనీయులు సెప్టెంబర్ నెలలో మూడవ సోమవారం నాడు ఆనంద సోమవారం పండుగ జరుపుకుంటున్నారు. దీనికి మూలం 1947లోనే నమోదాని అనే ఒక మన దగ్గర కలెక్టర్ల వంటి అధికార సంస్థ సెప్టెంబర్ 15 రోజున  పెద్దల పండుగగా జరపాలని నిర్ణయించింది. 1966 నాటికి ఈ పండుగ చాలా  ప్రాశస్త్యం పొందింది. ఈ సంవత్సరం సెప్టంబర్ 21 వ తేదీన ఆనంద సోమవారం పండగ జరుపుకున్నారు.

2020 సెప్టెంబరులో, జపాన్లో 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 36.17 మిలియన్లుగా ఉంది, ఇది దేశం యొక్క మొత్తం జనాభాలో 28.7% గా ఉంది, ఈ రెండు గణాంకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సర్వే తెలిపింది. వృద్ధుల జనాభా అంతకుముందు సంవత్సరం కంటే 300,000 పెరిగింది మరియు దాని వాటా 0.3 శాతం పెరిగింది. వృద్ధుల మొత్తం 15.73 మిలియన్లు, మొత్తం పురుష జనాభాలో 25.7%. వృద్ధ మహిళల సంఖ్య 20.44 మిలియన్లు లేదా జపాన్ అంతటా మహిళా జనాభాలో 31.6%.

 ఈ రోజు ఎక్కడ ఉన్న పిల్లలు అందరు ఇంటికి చేరుకుని పెద్దవారిని గౌరవించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ రోజు టీవీలలో వారి గురించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రకరకాల పిండి పదార్థాలతో  లంచ్ బాక్సులు సిద్దం చేసి పంచుతుంటారు.  ముఖ్యంగా వంద సంవత్సరాలు పైబడ్డ వాళ్ళ గౌరవించేందుకు సన్మానించేందుకు వారిని వినోద కార్యక్రమాలతో ఆనందింపజేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనం సాధారణంగా చేసుకునే పండుగ లో జరిగే అన్ని హంగులు ఈ పెద్దలను గౌరవించటం  అనే పండుగ రోజు ఉంటాయి. 

1963 నుండి ఈ పండగ రోజు జపాన్ ప్రభుత్వం వంద సంవత్సరాలు పైబడిన వారికి స్వచ్ఛమైన పెద్ద సిల్వర్ కప్పు ఇచ్చేది. ఈ సంవత్సరం 153 మందికి అలా సిల్వర్ కప్ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత వంద సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య పెరుగుతుండడం వల్ల ఖర్చులు తగ్గించేందుకు  2009 నుండి కప్పు సైజు తగ్గించారు.

2014లో ఈ కప్పుకు అర్హత సంపాదించిన వారి సంఖ్య అంటే వంద సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య 29, 397ఉండగా 2017 లో 32097 కు చేరింది. 

అందుకే ప్రస్తుతం ఇలా 100 సంవత్సరాలు నిండిన వారికి ఈ పెద్దలను గౌరవించే రోజు నాడు ప్రధానమంత్రి నుండి ఒక ప్రశంసా పత్రం మరియు మిశ్రమ లోహాలతో చేసినటువంటి కప్పును జ్ఞాపికగా  అందజేస్తున్నారు. ఇందు కోసం నిమిత్తం జపాన్ ప్రభుత్వం ప్రతి ఏటా ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. 


PRASAD MANDUVA

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు