పది రోజుల్లో రష్యా వాక్సిన్ - కరోనా అంతానికి కౌంట్ డౌన్


ఎవరెన్ని రకాలుగా అనుకున్నా రష్యా కోవిడ్ 19 వాక్సిన్ విషయంలో దూకుడుగానే ముందుకు వెళ్తోంది.వాక్సిన్ విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలను ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తి చేసి ఈ నెల 10..12 తేదీల మధ్య ప్రపంచ తొలి కోవిడ్ 19 వాక్సిన్ గా రష్యా ప్రభుత్వం విడుదల చేయనుంది.ఈ విషయాన్ని స్వయంగా రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మైఖేల్ మురాష్కో ప్రకటించారు.ప్రభుత్వం ఆధ్వర్యంలోని గమలేయా సంస్థ రూపొందించిన వాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ అన్ని నియమాలను అనుసరించి పూర్తయ్యాయని ఆయన చెప్పారు.తొలి దశలో వాక్సిన్ వైద్యులు..టీచర్లకు ఇస్తారని,అక్టోబర్ లో దేశ పౌరులకు పెద్ద సంఖ్యలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
     కాగా రష్యాలో vip లు వాక్సిన్ను ఈ ఏడాది ఏప్రిల్లోనే తీసుకున్నారనే వార్తలను  ఇప్పుడు నమ్మాలేమో..మొత్తానికి ఏ దేశం సాధిస్తేనేమి కరోనా మహమ్మారిపై తొలి పెద్ద విజయం ఇంకో పది రోజుల్లో నమోదు కానుంది.ఈ పరంపర అంచెలంచెలుగా ప్రపంచం మొత్తానికి విస్తరించి మహమ్మారి అంతమై మానవాళి మళ్లీ ప్రశాంతంగా జీవించడానికి బాటలు పడుతున్నాయని ఆశిద్దాం.
       
    

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు