సిద్ధవైద్యానికీ-క్లినికల్ ట్రయల్స్- దేశంలోనే తొలిసారి


దేశంలోనే తొలిసారిగా వెల్లూరు జిల్లాలోని ఒక ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది.వెల్లూరులో సిద్ధ వైద్య ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ జూలై 10 న ప్రారంభమై ఇప్పటివరకు 2300 మంది కోవిడ్ రోగులకు విజయవంతంగా నయం చేసింది.ఈ ఫలితాల పట్ల సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్లినికల్ ట్రయల్ రీసర్చ్ ఇండియా(సిటీఐఆర్) సంస్థ ఈ వెల్లూరు ఆస్పత్రికి సిద్ధ వైద్య విధానానికి ఆమోదం ఇచ్చింది.క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ముందు 20 మంది రోగులకు చికిత్స అందించి..తర్వాత దశల్లో సంఖ్య పెంచుతామని కోవిడ్ కేర్ సెంటర్ ఇంఛార్జి డాక్టర్ సుసీకన్నమ్మ చెప్పారు.ఈ చికిత్సా విధానంలో భాగంగా రోగులకు అశ్వగంధ,
తలిరతివదగం,
బ్రహ్మానంద భైరవన్ మాత్రలు, అదతోడ డికాక్షన్, అడతోట సిరప్.. వంటి వాటితో చికిత్స చేస్తారు.దీంతో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజులు,యోగా వంటివి చేయిస్తారు.ముఖ్యంగా అనుకూల వాతావరణం కల్పించి అసలు రోగం ఉందనే విషయం మర్చిపోయేలా చేయడం కీలక అంశం.
        *ఇ.సురేష్ కుమార్*
         30.08.20..4.30..pm

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు