అత్యాచార భాదితురాలికి న్యాయం చేయాలి..లండన్ యూకె తెలంగాణ ఎన్ఆర్ ఐ


లండన్,యుకె  తెలంగాణ ఎన్ఆర్ఐ డిమాండ్

లండన్ యుకె తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధి నీల శ్రీధర్


హైదరాబాద్ నగరంలో చదువు కోసం వచ్చిన నల్గొండ జిల్లాకు చెందిన గిరిజన యువతిపై  అత్యాచారం చేసిన వారిని ఖఠినంగా శిక్షించాలని లండన్, యుకె తెలంగాణ ఎన్ఆర్ఐలు  డిమాండ్ చేశారు. మీడియా ద్వారా భాదితురాలి విషయం తెల్సి ఆమెతో పోన్లో మట్లాడి మనో ధైర్యం కల్పించామని లండన్ యుకె తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధి నీల శ్రీధర్, వివిధ సంఘాల ఎన్ఆర్ఐ  ప్రతినిధులు పసునూరి కిరణ్, గంప వేణుగోపాల్, జయంత్ వద్దిరాజు, కిషోర్ బావర్చి, భాస్కర్ పిట్టల, రజిత గుండు, కమలా పుల్లూరి, నాగ ప్రశాంతి, రమణ సాధినేని తదితరులు   తెలిపారు. సభ్య సమాజం సిగ్గు పడేలా 139 మంది మానవ వికృత చేష్టలకు పాల్పడటం తమను కలిచి వేసిందని అన్నారు. భాదితురాలు సమర్పించిన సాక్షాధారాలను పరిగణన లోకి తీసుకుని ప్రత్యేక విచారణ కమీషన్ ఏర్పాటు చేయాలని లేదంటే  సిబిఐ విచారణకు ఆదేశించాలని లండన్,యుకె తెలంగాణ ఫోరం ప్రతినిధి నీల శ్రీధర్ కోరారు. బాదితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పినందుకు ఆమెకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. భాదితురాలికి న్యాయం జరిగే వరకు తెలంగాణ లో అన్ని వర్గాల వారు అండగా నిలవాలని వారు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు