అన్ని వైరస్ లకు ఒకే వాక్సిన్ తో చెక్

అన్ని వైరస్ లకు ఒకే వాక్సిన్ తో చెక్..!
భావితరాలకు ఇలాంటి బెడదలు ఉండవు
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆవిష్కరణ..
త్వరలో హ్యూమన్ ట్రయల్స్


కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఒక మహయజ్ఞానికే నడుం కట్టింది. కోవిడ్ 19 అనే కాకుండా కరోనా వైరస్ పరంపరకు చెందిన అన్ని వైరస్ లకు భరత వాక్యం పాడగలిగే అత్యంత శక్తివంతమైన వాక్సిన్ని రూపొందిస్తోంది.ఇప్పుడే కాదు భవిష్యత్తులో సార్స్ కుటుంబం నుంచి అటు జంతువుల్లో..ఇటు మనుషుల్లో ఎలాంటి వైరస్ లు రాకుండా నివారించేలా ఈ వాక్సిన్ తయారవుతోంది.ఇప్పటికే మానవాళిని పీడిస్తున్న కరోనా..ఎబోలా.. మెర్స్ వ్యాధులకు కూడా ఈ వాక్సిన్ ఉద్వాసన పలుకుతుంది.ఇందుకోసం అన్ని రకాల వైరస్ తెగల జన్యు సమాచారాన్ని సేకరించి సూపర్ కంప్యూటర్ ద్వారా క్రోడీకరించి వాక్సిన్ రూపొందించారు. Dion covax2 గా పిలుస్తున్న ఈ వాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ త్వరలోనే మొదలు కానున్నాయి.ఈ వాక్సిన్ మరో ప్రత్యేకత ఏంటంటే జెట్ సిరంజీలతో దీనిని సెకండ్ కంటే తక్కువ వ్యవధిలో చర్మం ద్వారా నొప్పి లేకుండా ఎక్కిస్తారు. అంతే కాకుండా పౌడర్ రూపంలో ఉంటుంది గమక చల్లని వాతావరణంలో ఉంచాల్సిన పనిలేదు. అంతే గాక రవాణా కూడా సులభం అవుతుంది.ఈ వాక్సిన్ విజయవంతమైతే ప్రపంచానికి వైరస్ ల నుంచి పూర్తిగా విముక్తి లభించినట్టే.వంద సంవత్సరాలకు ముందు ప్రపంచం చూసిన,ప్రస్తుతం మనం అనుభవిస్తున్న విపత్కర పరిస్థితుల వంటివి మన భావి తరాల వారికి ఉండబోవన్న మాట!
      *ఇ.సురేష్ కుమార్*
        26.08.20..9.05 pm

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు