కొజికోడ్‌ విమాన ప్రమాదంలో 19 మంది మృతి - 123 మందికి తీవ్ర గాయాలు

శుక్రవారం రాత్రి కేరళ లోని  కొజికోడ్‌ విమానాశ్రయంలో దుబాయి‌ నుంచి ‌ నుంచి కొజికోడ్‌కు చేరుకున్న ఎయిరిండియా విమానం రన్‌వేపై జారిపడి లోయలోకి దూసుకెళ్లిన ఘోర దుర్ఘటనలో  19మంది ప్రాణాలు కోల్పోగా123 మంది గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఎడతెరిపి లేని భారి వర్షం కురుస్తుండడంతో అతికష్టంపై అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. విమాన శకలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. ప్రయాణీకులంతా  ఏం జరిగిందో తెలియని ఆందోళనతో షాక్ కు లోనయ్యారు. భయానక వాతావరణంలో ఆక్రందనలు అరుపులతో ఆ ప్రాంతమంతా  గందరగోళంగా మారింది. ప్రమాదంలో చిన్న పిల్లల పరిస్థితి చెప్ప నలవి కాకుండా వారు పడుతున్న నరక యాతన అందరిని కంటతడి పెట్టించింది. ప్రమాదంలో నాలుగు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులను ఆసుపత్రులకు తరలించారు. 

పోలీసులు అంబులెన్సులు అక్కికి చేరుకునే లోపే స్థానికులు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడి కాక్‌పీట్‌లో చిక్కుకున్న పైలట్‌ను అతికష్టంమీద బయటకు తీశామని స్థానికులు  తెలిపారు. అంబులెన్స్‌లు చేరుకోవడానికి ముందే క్షతగాత్రులను స్థానికులు బయటకు తీసి, కార్లలో సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించారు.
విమాన ప్రమాదం జరిగిన తర్వాత భారీ శబ్దం రావడంతో అక్కడకు చేరుకున్నామని స్థానికుడు తెలిపారు. విమానం సీట్ల కింద చిన్న పిల్లలు చిక్కుకుని ఉన్న దృశ్యాలు కంటతడిపెట్టించాయని తెలిపాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు