విజయ వాడలో కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి


విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్‌ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు.
చికిత్సపొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని విజయవాడ పోలీస్ కమీషనర్ బి. శ్రీనివాసులు తెలిపారు. తెల్లవరు జామున 5 గం సమయంలో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 30 మంది పేషెంట్లు మరో 10 మంది సిబ్బంది ఉన్నారని కమీషనర్ తెలిపారు.
అగ్ని ప్రమాదం సంఘటనపై సిఎం జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారి చేసారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ప్రకటించారు. భాదితులకు అండగా ఉంటానని ఎన్ని విదాలా  ఆదుకుంటామని చెప్పారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే  ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటనపై రెండు విచారణ కమిటీలు ఏర్పాటు చేశామని 48 గంటల లోపు నివేదికలు అంద చేస్తాయని హోం మంత్రి సుచరిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. విజయవాడ నగరంలో కోవిడ చికిత్స కోసం 15 ప్రైవేట్  ఆసుపత్రులు పనిచేస్తున్నాయని ఎన్ని తనిఖి చేయాలని అదికారులను ఆదేశించిమని చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు