టిటిడి లో కరోనా కేసుల కల కలం -బోర్డు సమావేశంలో తదుపరి కార్యాచరణ

తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కేసులు కల కలం రేపాయి.పూజారులతో పాటు 10మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది. బాధితుల్లో నలుగురు భద్రతా సిబ్బందికి, నలుగురు వాయిద్యకారులు అయిన వారికి, ఒక అర్చకునికి,ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం.దాంతో కరోనా భాదితులను ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు.వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారైంటైన్ లో ఉంచారు.కరోనా కేసులు వెలుగు చూడడంతో టిటిడి అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.టీటీడీ ఉద్యోగులు,స్వామి కైంకర్యాల్లో పాల్గొనే పూజారులు సహా మొత్తం 10మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.వారందరినీ వెంటనే ఆసుపత్రులకు తరలించి,వారి కుటుంబీకులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.ప్రస్తుతం వారి కటుంబ సబ్యులను హోం క్వారెంటైన్ లో ఉంచామని చెప్పారు.తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నామని,జ్వరం లేకుంటేనే కొండపైకి అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.జూన్ ఆఖరి వారంలో విధులు నిర్విహించిన వారికి కరోనాసాకినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.ఒకటి రెండు రోజుల్లో టిటిడి బోర్డు సమావేశం వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు.
కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ప్రారంభం కావడంతో దర్శనాలు నిలిపి వేశారు. లాకో డౌన్ ముగిసిన అనంతరం చాలా రోజులకు జూన్ 11 నుండి తిరిగి దర్శనాలు అనుమతించారు.మొదట్లో రోజుకు 6 వేల చొప్పున అనుమతించి ఆ తర్వాత 12 వేలకు పెంచారు.అయితే భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో కరోనా వ్యాప్తి పెరిగినట్లు టిటిడి అధికారులు భావిస్తున్నారు.శ్రీవారి దర్శనం కొనసాగిస్తారా లేక నిలిపి వేస్తారా ఏ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారనే విషయం బోర్డు సమావేశం అనంతరం ప్రకటించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు