మంగళగిరి నియోజక వర్గం జర్నలిస్టులకు నారా లోకేశ్ భీమా సౌకర్యం


జర్నలిస్టులను ఆదుకోవడంలో  ఆదర్శంగా నిలిచిన నారా లోకేశ్
మంగళగిరి నియోజకవర్గం జర్నలిస్టులకు భీమా ప్రీమియం 

చంద్రబాబు నాయుడు తనయుడు మాజి మంత్రి  ప్రస్తుత ఎమ్మెల్యే నారా లోకేశ్ కష్టకాలంలో ఉన్న జర్నలిస్టులను ఆదుకుని ఆదర్శంగా నిలిచారు. మంగళగిరి నియోజక వర్గంలోని 62 మంది జర్నలిస్టులకు లోకేశ్ ఉచిత బీమా సౌకర్యం ప్రకటించారు. సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల మేర లబ్ది పొందేలా బీమా కల్పించారు.కరోనా మరణాలకు కూడా బీమా వర్తింపజేసేలా తీసుకువచ్చిన ఈ పాలసీలకు ప్రీమియంను నారా లోకేశ్ స్వయంగా చెల్లించారు.రాష్ర్టంలోని జర్నలిస్టులందరిని ప్రభుత్వం ఆదుకోవాలని నారా లేకేశ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ ప్రభుత్వం బీమా చేయించాలని కరోనాతో మరణించిన జర్నలిస్టులకు కుటుంబాలకు రూ.50 లక్షలసచొప్పిన ఆర్థిక సహాయం అందచేయాలని కోరారు.

తెలుగు రాష్ర్టాలలో జర్నలిస్టుల పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారింది. యాజమాన్యాలు పట్టించు కోక పోగా జీతాల్లోకొత విధించాయి. కొన్ని యాజమన్యాలైతే ఏం ఇవ్వకుండానే జర్నలిస్టుల చేత వెట్టి చేయించు కుంటున్నాయి.తెలంగాణా లోను పిలోను ఇప్పటి వరకు ఆరుగురు జర్నలిస్టులు కరోనా సోకి చనిపోయారు.వందలాది మంది కరోనా భారిన పడ్డారు. తెలంగాణ లో మీడియా  అకాడమి ద్వారా కరోనా సోకిన వారికి రూ 20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేశారు. అట్లాగే ఫస్ట్ కాంటాక్టు వారికి రూ 10స వేల చొప్పున ఆర్థిక సహాయం చేసారు.
ఎపిలో మంగళగిరి నియోజకవర్గంలో జర్నలిస్టులకు నారా లోకేశ్ సహాయం చేసిన రీతిలో రెండు తెలుగు రాష్ర్టాలలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సహాయ పడితే జర్నలిస్టులకు ఎంతో ఊరట కలుగుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు