తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్ - జీవించే హక్కును కాలరాసేలా ప్రభుత్వం తీరు ఉందని ఆగ్రహం

కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ సర్కార్ పై హైకోర్టు మండిపడింది. వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించకుండా పౌరుల జీవించే హక్కును కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాప్తి కట్టడి, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల అందజేత తదితర అంశాల్లో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని సర్కారును ప్రశ్నించింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని కరోనా టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న టెస్టులు ఎందుకు అపేయాల్సి వచ్చింది? భారత వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు నిర్వహించారో తెలపాలని ప్రభుత్వాన్ని అదేశించింది.
సెంట్రల్  టీం ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశాలను ఈ నెల 17న తెలపాలని ఆదేశించిన పనులు పూర్తి చేయకపోతే జూలై 20న చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ హాజరుకావాలని ఆదేశించింది.
చేసింది. నివేదికలు సమర్పించకపోతే కోర్టు ధిక్కరణగా భావిస్తామని, ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపీల్స్ ఎందుకు చేయకూడదని, 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే పరీక్షలు చేయాలని ఆదేశించామని తెలిపింది.
తెలిపింది.ఎన్ని యూనిట్స్ తెచ్చారని, ఎందుకు ఇప్పటి వరకు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.50 వేల టెస్టులు చేస్తామని చెప్పి..మూడు రోజులు అసలే టెస్టులు చేయలేదని కోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్ , శ్రీరంగం పూజిత కోర్టు దదృష్టికి తీసుకెళ్లారు.ఇప్పటికైనా ఆర్.ఏ.డీ. శాంపిల్స్ సేకరించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు