పబ్లిక్ లో(జనసంచారంలో) దొరకడం వల్లే వికాస్ దూబే బతికి పోయాడా ?




ఉత్తర ప్రదేశ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే జనసంచారం గల ప్రదేశంలో పోలీసులకు పట్టుబడం వల్లే ఎన్ కౌంటర్ ముప్పు నుండి తప్పించు కోగలిగాడా? అవునని అంటున్నారు ....పరిశీలకులు...మ
‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆల‌యంలో గురువారం ఉదయం మాస్కు పెట్టుకుని తిరుగుతున్న వికాస్ దూబేను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చాకచక్యంగా వికాస్ దూబేను అదుపులోకి తీసుకున్నారు.
ఓపోలీస్ కానిస్టేబుల్ వికాస్ దూబే సమీపంలోకి మఫ్టీలో వెళ్లి అతన్ని కదలకుండా భందించాడు. దాంతో ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న వికాస్ దూబే ఏం చేయాలో తెలియక తాను కాన్పూర్ కు చెందిన  వికాస్ దూబేనంటూ గట్టిగా అరిచాడు. అతన్ని గట్టిగా పట్టుకున్న కానిస్టేబుల్.... చు ప్ ఆవాజ్ నహీ కర్నా  అంటూ వికాస్ దూబే చెంప చెళ్లు మనిపించాడని దాంతో అతను నోరు మెదపకుండా ఉండి పోయాడని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు మీడియా వార్త కధనంలో పేర్కొంది.
వికాస్ దూబే పోలీసులకు ఇంత సులభంగా ఎలా చిక్కాడనే విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి. 10 పోలీసు బృందాలు ఉత్తర భారతదేశంలోని  10 రాష్ట్రాలలో జల్లెడపడుతున్నాయి. ఈక్రమంలో వికాస్ దూబే అనుచరులు ఐదుగురిని పోలీసులు ఎన్ కౌంటర్లలో  హతమార్చారు. ఈ పరిస్థితులలో పోలీసులకు వికాస్ దూబే రెండు సార్లు చిక్కినట్లే చిక్కి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ లో ఉంటే పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం ఖాయమని వికాస్ దూబేై తన ఇద్దరు అనుచరులను వెంటబెట్టుకుని రాజస్థాన్ లోని కోట మీదుగా మధ్యప్రదేశ్ కు చేరాడు.మారు పేరుపై ఐ.డి క్రియేట్ చేసి వివిద మార్గాల ద్వారా ప్రయాణం చేశాడు.  ఉజ్జయిని  మహంకాళి ఆలయంలో ముఖానికి మాస్కు తగిలించుకుని తిరుగుతున్న వికాస్ దూబేను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని పట్టుకోగలిగారు. వికాస్ దూబే ఆలయంలో జనం రద్దీలో  పోలీసులకు దొరకడం వల్ల ఎన్ కౌంటర్ ముప్పు తప్పించుకోగలిగాడనేది మీడియావార్తలు స్పష్టం చేస్తున్నాయి .  ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనం రద్దీ ప్రతి రోజు ఎక్కువగానే  ఉంటుంది. మొత్తానికైతే   జనం ఉండడం వల్లే వికాస్ దూబే ప్రాణాలు దక్కాయి. అదే వేరే చోట అయితే ఈపాటికే వికాస్ దూబే కథ ముగిసిపోయేది. ఆలయాలయం లోకి ప్రవేశించేందుకు వికాస్ దూబే విచిత్రంగా విఐపి పాస్ సంపాదించాడు.  అతనికి పాస్ ఎట్లా వచ్చిందనే విషయం పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరో వాదన ఏమంటే ప్రామాలు దక్కించుకునేందుకే దూబే మంహాకాళి ఆలయంలో పోలీసులకు లీకులిప్పించుకుని దొరికాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లొంగి పోయాడనే మరో కధనం కూడ వినిపిస్తోంది. పోలీసులు పూర్తి విషయాలు వెల్లడించాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు