కోవిడ్ 19 వాక్సిన్ పై రష్యా కు అంత భరోసా ఎందుకు ?

ఏప్రిల్ నుండే రష్యాలో వివిఐపిలపై వాక్సీన్ ప్రయోగాలు 


కోవిడ్ 19 వాక్సిన్ వచ్చే నెలలోనే అందుబాటులోకి తెస్తామని రష్యా అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతోందో తెలుసా..ఆ దేశంలో ఏప్రిల్ నుంచే కొందరు వాక్సిన్ తీసుకోవడం ప్రారంభించారు.దేశంలోని వివిఐపి ప్రముఖ వ్యక్తులు,నాయకులు,అత్యంత ఉన్నతాధికారులు ఇలా ఏప్రిల్లోనే వాక్సిన్ చేయించుకున్న వారిలో ఉన్నారు.వారంతా ఇప్పుడు సురక్షితంగా తిరుగుతున్నారు.ఇదే అత్యంత కీలక హ్యూమన్ ట్రయల్ గా పేర్కొనవచ్చు.అధ్యక్షుడితో సహా పలువురు ప్రముఖులు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని గామెల్యా సంస్థ రూపొందించిన వాక్సిన్ చేయించుకుని కరోనా బారిన పడకుండా ఉన్నారు గనకనే ఆ వాక్సిన్ పై అత్యంత విశ్వాసంతో ఆగస్టులోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెబుతూ భారీ సంఖ్యలో ఉత్పత్తికి ఏర్పట్లు చేసుకుంటోంది.
  
"రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో రూపొందించిన వాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ విషయాన్ని రక్షణ శాఖ మొదటి డిప్యూటీ మంత్రి రుస్లాన్ ప్రకటించారు.రెండో దశ వలంటీర్లు కూడా పూర్తి ఆరోగ్యంతో,పెరిగిన రోగనిరోధక శక్తి తో సోమవారం నాడు డిశ్చార్జ్ అయ్యారని వెల్లడిస్తూ ఇక రష్యా పౌరులకు ఇవ్వడమే తరువాయి అని ఆయన చెప్పారు.మూడో దశలో వేలాది మంది వలంటీర్లపై ప్రయోగాలు ఆగస్టు 3 నుంచి రష్యా..
సౌదీ అరేబియా..యుఎఇ దేశాల్లో ప్రారంభం కానున్నాయి.
రష్యా ప్రభుత్వ సంస్థ గామెలివేయా రూపొందించిన వాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి రష్యాలో 30 మిలియన్ డోసులు..ఇప్పటికే అంగీకారం కుదిరిన ఐదు దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో 170 మిలియన్ డోసులు ఉత్పత్తి కానున్నాయి.పెద్ద వార్తే..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు