కరోనా వాక్సిన్ తయారీలో మనమే ఫస్ట్ - ఆగస్ట్ 15న లాంచ్

ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) సంయుక్తంగా పరిశోదనలు పూర్తి చేసి క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. అన్ని సమవ్యంగా జరిగితే భారత్ బయోటెక్, ఐసీఎంఆర్‌‌లు ఆగస్టు 15న కోవ్యాక్సిన్‌ను లాంచ్ చేయవచ్చని అధికారిక సమాచారం.
స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ (బీబీబీ152) క్లినికల్ ట్రయల్స్ కోసం దాదాపు డజను ఇనిస్టిట్యూషన్లు ఎంపిక చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించబడే అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు కాబట్టి క్లినికల్ ట్రయల్స్‌ను పెంచాలని ఐసీఎంఆర్ ఈ సంస్థలను కోరింది.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ప్రజారోగ్య వినియోగం కోసం ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐసీఎంఆర్ ప్రయత్నిస్తుండగా, ఇప్పటి వరకు క్లినికల్ ట్రయల్సే ప్రారంభం కాకపోవడంతో అది ఎంత వరకు సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా సమస్య తీవ్రత దృష్ట్యా వాక్సిన్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.  "అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత 2020 ఆగస్టు 15 నాటికి ప్రజారోగ్య వినియోగం కోసం వ్యాక్సిన్‌ను విడుదల చేయాలని భావిస్తున్నాం" అని పరిశోధనా సంస్థ తెలిపింది. అయితే, తుది ఫలితం ఈ ప్రాజెక్టులో పాల్గొన్న అన్ని క్లినికల్ ట్రయల్ సైట్ల సహకారంపై ఆధారపడి ఉంటుందని ఐసీఎంఆర్ వివరణ ఇచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు