చీఫ్ సెక్రటరీ పై హైకోర్టు ప్రశ్నల వర్షం - కరోనా నియంత్రణ చర్యలు సరిగా లేవని ఆగ్రహం




కరోనా కేసుల నియంత్రణలో ప్రభుత్వం తీరుపై మొదటి నుండి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వచ్చిన హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వడం కోసం చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ హైకోర్టు ముందు హాజరయ్యారు . హైకోర్టు పలు అంశాలను ఎ్తతి చూపుతూ చీఫ్ సెక్రెటరి సోమేశ్ కుమార్ పై ప్రశ్నలు సంధించింది. కరోనా కేసులు రాష్ర్టంలో ఎందుకు తక్కువ జరుగుతున్నాయని ప్రశ్నించింది. రాష్ర్టంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెస్టులు తక్కువేనని పేర్కొంది. డబ్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే మూడున్నర లక్షలకు పైగానే టెస్టులు చేశామని సీఎస్ కోర్టుకు తెలియజేశారు.  హెల్త్ బులిటెన్‌లో ఎందుకు  తప్పుడు సమాచారం ఇస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు గుర్తు చేసింది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో  సరైన సౌకర్యాలు లేవని అట్లాగే చికిత్స లు జరగడం లేదని సకాలంలో ఆక్సిజన్ సమకూర్చక పోవడంతో కరోనా భాదితులు చనిపోయిన విషయాన్ని ప్రభుత్వ అధికారుల ముందు ఉంచింది. ఆసిఫాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లోనూ కరోనా వైరస్ ప్రభావంతో జనం చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయని హైకోర్టు తెలిపింది. వైరస్ పట్ల వారికి ఏం అవగాహన కల్పిస్తున్నారని ప్రశ్నించింది.  ప్రభుత్వం తమ ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని అగ్రహం వ్యక్తం చేసింది.

 కరోనాపై జారీ చేసే హెల్త్‌ బులిటిన్‌ను తప్పులు లేకుండా ఇవ్వాల‌ని, క‌రోనా స‌మాచారాన్ని ప్రతి రోజు ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అలాగే ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది. పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫైర్ అసోసియేషన్ సెంటర్స్‌ను వాడుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

కరోనా విషయమై తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల హైకోర్టు గతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. హెల్త్ బులిటెన్ విషయంలోనూ ప్రశ్నలు సంధించింది. తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్ట్ చీఫ్ సెక్రటరీని విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఆయనతోపాటు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టు వీడియోకాన్ఫరెన్సు ద్వారా   హాజరయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు