వైరస్ ను తరిమి కొట్టే వాక్సిన్ ఇదిగో - ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి వాక్సిన్ సక్సెస్ -ఆస్ట్రాజెనికా వాక్సిన్ ప్రయోగ ఫలితాలు వెల్లడి- ఈ ఏడాది చివరలో పూర్తి ఫలితాలు


ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి వాక్సిన్ సక్సెస్ -ఆస్ట్రాజెనికా వాక్సిన్ సమర్దవంతం - సురక్షితమని ప్రకటించిన ఆక్స్ ఫర్డ్


కరోనా మహమ్మారి విషయంలో ఇక భయపడే పరిస్థితులు ఉండబోవు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అరికట్టేందుకు అనేక దేశాలలో వాక్సిన్ తయారీ కోసం ప్రయోగాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ దశలో ఆఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి మొదటి సారిగా ఉత్పత్తి చేసిన ఆస్ట్రాజెనికా అనే వాక్సిన్ కరోనాతో సమర్ధవంతంగా పోరాడుతుందని ప్రయోగాల్లో నిర్దారణ జరిగింది.ఈ విషయం స్వయంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి సోమవారం ప్రకటించింది.కరోనా మహమ్మారి విషయంలో ఇప్పటి వరకు వరుసగా ఆందోళన కరమైన వార్తలు వింటూవచ్చిన వారికి ఆక్ఫ్ ఫర్డ్ యూనివర్శిటి వెల్లడించిన విషయాలు ఎంతో ఊరట చేకూర్చాయి.తాము ఉత్పత్తి చేసిన ఆస్ట్రాజెనికా వాక్సిన్ కరోనా వైరస్‌తో సమర్థంగా పోరాడగలదని పైగా ఎంతో సురక్షితమని ఫలితాలలో నిర్దారణ అయిందని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి శుభ వార్త చెప్పింది.తమ వ్యాక్సిన్ వైరస్‌ను బాగా తట్టుకోగలదని ఆక్స్‌ఫర్డ్ తెలిపింది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. ఈ మేరకు మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. మరిన్ని ఫలితాల కోసం చివరి దశగా వృద్ధులపై ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపింది.ఈ ఏడాది చివరి వరకు ప్రయోగాల పూర్తి ఫలితాలు వస్తాయని పేర్కొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు