భీమా డబ్బుల కోసం భర్తను కడ తేర్చింది..మొదట ఇన్సూరెన్సు ప్రీమియం కట్టింది..తర్వాత చంపేసింది


భర్త తాగుబోతు..పైగా తాగి వచ్చి ఇంట్లో బాగా న్యూసెన్సు చేసే వాడు..భార్య పిల్లలను భాగా ఇబ్బందుల పాలు చేసే వాడు.. వాయి వరుసలు లేకుండా ప్రవర్తించే వాడు..దాంతో భర్త భాదలు భరించ లేక ఎట్లాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. ఊరికే చంపే బదులు భీమా చేయించి చంపితే డబ్బులు వస్తాయని 20 లక్షల భీమా ప్రీమియం కట్టించి ఒక రోజు చంపేసింది.ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు విచారణలో తేల్చారు.


పర్వత గిరి మండలం హత్య తండకు చెందిన బాదావత్ వీరన్న(36) జూన్ 19 తేదీన హత్యకు గురయ్యాడు.బాదావత్ వీరన్న భార్య బాదావత్ యాకమ్మ ఏమి ఎరుగనట్లు తన భర్తను ఎవరో హత్య చేసారని నమ్మించే ప్రయత్నం చేసింది.పోలీసులు బాదావత్ యాకమ్మ చెప్పిన విషయాలను నమ్మలేదు. ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి సిసి కెమెరాలు,సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అసలు నిందితులను పట్టుకున్నారు.భార్య యాకమ్మతో పాటు ఆమెకు సహాయం చేసిన స్వయాన అన్న భూక్య బిచ్య,ఆయన బార్య భూక్య బుజ్జిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా రిమాండ్ చేసారు.
'ఇంట్లో 14 సంవత్సరాల వయసు కలిగిన కూతురు ఉంది..బాగా తాగివచ్చి ఇంట్లో కూతురు అనికూడ చూడకుండా అసభ్యంగా ప్రవర్తించేవాడు..అందుకే చంపేయాలని నిర్ణయించుకుని..ముందుగా భీమా చేయించానని.. అతర్వాత పథకం ప్రకారం హత మార్చామని', మృతుని భార్య పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. ఖాళీ సీసాల వ్యాపారం చేసే భర్త కు స్థానిక గ్రామీణ బాంకులో 20 లక్షల కు భీమా చేయించింది.
హత్య చేసే ముందు నెక్కొండలో వీరన్నకు తన సోదరుని చేత బాగా మద్యం తాగించి..ఆ తర్వాత మోటార్ సైకిల్ పై హత్య తండాకు తీసుకువెళ్లి వ్యవసాయ బావి దగ్గర మద్యం మత్తులో ఉన్న వీరన్న మెడకు తాడు బిగించి చంపేసారు. చచ్చాడో లేదో అన్న అనుమానంతో ముఖంపై బండలు ఎత్తి పడేసి మృత దేహాన్ని కాలువలో పడేసారు. తెల్లవారి తన భర్త కనిపించడం లేదని వెదుకుతూ కాల్వ వద్దకు వెళ్లి భర్తమృత దేహాన్ని చూసి ఎవరో హత్య చేశారని ఉరంతా నమ్మించే ప్రయత్నం చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులకు  అనుమానం వేసి  మొత్తం కేసంతా తిరగ దోడడంతో  అసలు విషయం వెలుగు చూసింది.
నిందితులను ముగ్గురిని అరెస్ట్ చేసి వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి వెంకట లక్ష్మి  సమక్షంలో మీడియా ఎదుట   ప్రవేశ పెట్టారు.
కేసును ఛేదించి అసలు నిందితులను పట్టుకున్న మామునూర్ ఎ.సి.పి శ్యాంసుందర్ పర్వతగిరి సర్కిల్ ఇన్స్  పెక్టర్ కిషన్, పర్వతగిరి, ఐనవోలు, సంగెం ఎస్.ఐలు ప్రశాంత్ బాబు, నర్సింగరావు, సురేష్ తో పాటు కానిస్టేబుల్లు రాజు, రాజశేఖర్, గణపతి, మోహన్, రాజు, లింగమూర్తి, శివ, నాగరాజు, సూర్యనారయణ, కుమారస్వామిలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్ అభినందించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు