హిప్పీ స్టైల్లో విజయ్ దేవరకొండ..వేళాడే జుత్తు..ఫ్రెంచ్ కట్


గడ్డాలు,మీసాలు వెల్లాడేలా పెంచుకుని విచిత్ర వేశధారణతో కనిపించే హిప్పీలను ఎపుడైనా చూసారా..?చూడక పోయి ఉంటే విజయ్ దేవరకొండను చూడండి.ఫాదర్స్ డే సందర్బంగా విజయ్ దేవర కొండ తన తండ్రి గోవర్దన్ రావుకు విషెస్ చెప్పి సోదరుడు ఆనంద రావుతో కల్సి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.విజయ్ దేవరకొండ ఈ ఫోటోలలో న్యూ లుక్ లో కనిపించాడు. అదే 'హిప్పీ'లను పోలిన వేశధారణ..వేలాడే తల వెంట్రుకలు ఫ్రెంచ్ కట్ తో అచ్చం 'హిప్పీ' లను పోలిన లుక్ ఉంది.హిప్పీలంటే అమెరికాలో 1960 దశకంలో సాంప్రదాయ సంస్కృతికి  భిన్నంగా కొత్త అవతారలతో ఫ్రీ కల్చర్ పేరిట వచ్చిన ఒక కొత్త ట్రెండ్. హిప్పీల మూవ్ మెంట్ దేశ దేశాలకు పాకింది.విచిత్ర వేశధారణలతో చేతిలో వాయుద్యాలు పట్టుకుని నెత్తిన వేలాడే జుట్టు పెంచుకుని కనిపించే వారు.అచ్చం విజయ్ దేవర కొండ న్యూ లుక్ కూడ అట్లాగే కనిపించింది.

'నేను తీసుకునే నిర్ణయాలు, చేసే తప్పులు, నష్టాలు, సాహసాలు అన్నింటా ఆయనే ముందుంటారు. ది ఫస్ట్ దేవరకొండ.. హ్యాపీ ఫాదర్స్ డే. ఐ లవ్ యూ'అనే మెసేజ్ తో తండ్రి పక్కనే కూర్చున్న విజయ్ దేవర కొండ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ న్యూలుక్ ఏంటంటే.. అంతా సస్పెన్స్...మరి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.సినిమా నటులు తాము ఊరికే కొత్త గెటప్ లలో కనిపించరు.సినిమా షూటింగ్ ల సమయంలో పాత్రలకు తగిన రీతిలో వాటి వేశాలంకరణ లో కొద్ది రోజులు ఉంటారు.అట్లా వేశం కోసం విజయ్ ఈ లుక్ లో కనిపించి ఉంటాడని అభిమానులు ముచ్చట పడుతున్నారు.
విజయ్ దేవర కొండ తాజాగా ఫైటర్ మూవీ చిత్రం కోసం ఈ వేషధారణలో కనిపించి ఉండవచ్చిన భావిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా నిలిచి పోయింది. ముంబై నగరం నేపద్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి,కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా ఈచిత్రం నిర్మిస్తున్నారు.విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే నటిస్తున్నారు.సో చూద్దాం...దేవర కొండ హిప్పి స్టైల్లో ఇదే సినిమాలోనా..లేక మరే ఇతర సినిమాలో నైనా ఇలా కనిపించ బోతున్నాడో.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు