కనికరించే వారుంటే ఖండాంతరాలు అడ్డు కావు - కాన్సర్ పేషెంటు కుటుంబాన్ని ఆదుకున్న వరంగల్ లండన్,యుకె ఎన్ ఆర్ ఐలు

NRI's help poor students

స్పందించే హృదయం ఉంటే ఖండాంతరాలు అడ్డు కావన్న వరంగల్ ఎన్ ఆర్ ఐ లు
పుట్టిన గడ్డపై మమకారంతో లండన్ నుండే పలు సేవా కార్యక్రమాలు
కాన్సర్ పేషెంటు కుటుంబాన్ని ఆదుకున్న  ఎన్ ఆర్ ఐలు
పిల్లల చదువులకు ఆర్థిక సహాయం


ఆకుల నిరంజన్ ఓ సగటు జీవి.ఆయనకు భార్య ముగ్గురు కుమారులు.ముగ్గురు కుమారులు ఒకే కాన్పులో జన్మించిన కవలలు.కుటుంబాన్ని పోషించు కునేందుకు ఓ చికెన్ సెంటర్ లో దిన సరి వేతనంపై చాలాకాలం పనిచేశాడు.పిల్లలను మంచి చదువులు చదివించాలని వారిని ఇంగ్లీషు మీడియంలో చేర్పించాడు.భార్య లక్ష్మి కూడ భర్తకు చేదోడు వాదోడుగా ఓ బ్యూటి పార్లర్ లో పని చేస్తూ కుటుంబానికి తోడయ్యారు.ఎన్ని కష్టాలకోర్చి అయినా పిల్లలను పై చదువులు చదివించాలని ఎంతో తపించారు.కాని విధి వక్రీకరించడమంటే ఇదే.ఆకుల నిరంజన్ హఠాత్తుగా ఖరీదైన జబ్బుగా చెప్పుకునే కాన్సర్ భారిన పడ్డాడు.ఇక ఆ కుటుంబం కష్టాలు అన్ని ఇన్ని కావు.వైద్య ఖర్చుల కోసం తెల్సిన వారందరి దగ్గరా అప్పులు చేశారు.సుమారు ఐదారు లక్షల అప్పుల భారం పడింది కాని నిరంజన్ వ్యాధి నయం కాలేదు.శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెబితే శస్త్ర చికిత్స కూడ చేయించారు.ప్రస్తుతం నిరంజన్ వ్యాధి ముదిరి ఫోర్త్ స్టేజ్ లో  ఉన్నాడు.పిల్లలు ముగ్గురు చంద్ర,సూర్య,కృష్ణ బడి మానేసారు.లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో వీరు ముగ్గురూ పరీక్షలు లేకుండనే 10వ తరగతి లోకి ప్రవేశించినట్లు కాని ఇక ముందు చదువులు కొనసాగించే పరిస్థితులు లేవు.వీరు ముగ్గురూ హన్మకొండ లోని పాత్ ఫైండర్ పాఠశాలలో చదువుతున్నారు. ముగ్గిరిలో ఒక్కరికి పాఠశాల యాజమాన్యం ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించింది.అయినా కుటుంబ పరిస్థితులు వారిని చదువుకు దూరం చేసాయి.


లండన్ లో ఉంటూ పుట్టిన గడ్డపై మమకారంతో సామాజిక సేవకు ఖండాంతరాలేవి అడ్డు కాదని రుజువు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించిన వరంగల్ వాసులు నిరంజన్ కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు. నిరంజన్ భార్య లక్ష్మి వరంగల్ ఎన్ ఆర్ ఐ ఫోరం లండన్,యుకె అద్యక్షులు శ్రీధర్ నీల కు వాట్సప్ లో తమ దీనావస్థను తెలియ చేసారు.వెంటనే స్పందించిన శ్రీధర్ లండన్ లో ఉండే ఇతర వరంగల్ ఎన్ ఆర్ ఐ లను సంప్రదించి రెండు లక్షల తక్షణ సహాయం అంద చేసారు.నిరంజన్ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చారు.ముగ్గురు  పిల్లలు మద్యలో చదువు ఆపి వేయవద్దని వారికయ్యే ఫీజులు పుస్తకాలు,నోట్ బుక్స్ కోసం ఖర్చులు భరిస్తామని చెప్పి లక్ష రూపాయలు పాత్ ఫౌండర్ పాఠశాల ప్రిన్సిపాల్ సరళా అరుణాచలం కు అంద చేసారు. పిల్లల చదువుల కోసం లండన్ లో ఉన్న ఎన్ఆర్ లు స్పందించి ఆర్థిక సహాయం చేసినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ వారికి అభినందనలు తెలిపారు.
'పిల్లలు బడి మానేసారని తెల్సి చాలా భాద కలిగింది..ముందుగా వారిని బడికి పంపపాలని చెప్పి...లక్షరూపాయలు ఇచ్చాం..వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందు
ల్లో ఉందని మరో లక్ష రూపయలు ఇచ్చాం',అని వరంగల్ ఎన్ ఆర్ఐ ఫోరం లండన్ ఆద్యక్షులు శ్రీధర్ నీల ఫోన్ లో మనతెలంగాణ వెబ్ సైట్ ప్రతినిధి కి  తెలిపారు.
తమ ఫోరం పౌండర్ కిరణ్ పసునూరి, ఉపాద్యక్షులు భాస్కర్ పిట్టల,జయంత్ వద్దిరాజు, రమణ సాదినేని, వంశి మునిగంటి, నాగ ప్రశాంతి, మాడి శెట్టి భాస్కర్ తో పాటు ఇతర ఎన్ఆర్ఐలు ఈ సహాయం చేసారని శ్రీధర్ వివరించారు.
లండన్ లో ఉన్న వరంగల్ వాసుల సహాయానికి నిరంజన్ కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియేచేసుకుంది.

ఖండాంతరాల్లో ఉన్నా పుట్టిన గడ్డపై ఎన లేని మమకారం...వారిది


ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్నా పుట్టిన గడ్డ పై మమకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది వరంగల్ ఎన్ ఆర్ ఐ ఫోరం లండన్,యుకె శాఖ.'మేమెంతో కష్ట పడి లండన్ కు వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నాం..పుట్టిన గడ్డను మరిచి పోకూడదనే కృతజ్ఞతతో తోచిన సహాయం అంద చేస్తున్నాం'అన్నారు శ్రీధర్ నీల.' మేం..లండన్ లో ఉన్నా సేవాకార్యక్రమాలకు ఎంతో దూరంలో లేమని..చెప్పేందుకే', వరంగల్ వాసులతో ఏర్పాటైన ఎన్ఆర్ఐ ఫోరం పనిచేస్తున్నదని శ్రీధర్ నీల తెలిపారు.

వరంగల్ ఎన్ ఆర్ ఐ ఫోరం లండన్,యుకె యూనిట్ సభ్యులు వరంగల్ లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం పంచుకున్నారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ పీరియడ్ లో మారు మూల ప్రాంతాలలో నివసిస్తున్న ఆది వాసి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అంద చేసారు.వరంగల్ లో అంధుల పాఠశాలకు మొదటి అంతస్తులో  అదనపు తరగతి గది కోసం రూ లక్ష 25 వేల ఆర్థిక సహాయం చేశారు.లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన టివి కళాకారులకు నిత్యావసర సరుకులు కూడ పంపిణి చేశామని ఫోరం అద్యక్షులు శ్రీధర్ నీల తెలిపారు.ఒరిస్సా వలస కార్మికులను హైదరాబాద్ నుండి  వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాటు చేసిన వాహనాలకు కూడ   ఆర్థిక సహాయం చేసామని శ్రీధర్ నీల వివరించారు.

శ్రీధర్ నీల - లండన్..ఫోన్ నెంబర్..+447572378677
PATH FINDER SCHOOL PRINCIPAL..SARAALA  ARUNACHALAM..9553846600


“As you grow older, you will discover that you have two hands — one for helping yourself, the other for helping others.” — Audrey Hepburn. ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు