హైదరాబాద్ లో 25 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ - ఆందోళనలో జర్నలిస్టు వర్గాలు


హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో అనేక మంది కరోనా భారిన పడటం జర్నలిస్టు వర్గాల్లో కల కల రేపింది.మనోజ్ కుమార్ అనే యువ జర్నలిస్టు కొద్ది రోజుల ముందు కరోనా భారిన పడి చికిత్స పొందుతూ చనిపోగా మరో 25 మంది జర్నలిస్టులు తాజాగా కరోనా భారిన పడ్డారు. వీరిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.కరోన సోకిన జర్నలిస్టులకు మీడియా ఆకాడమి నుండి ఒక్కొక్కరికి రూ 20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందేశారు.వారి బాంకు అక్కౌంట్లలో  నేరుగా డబ్బులు జమ చేసినట్లు మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.అట్లాగే పాజిటివ్ పేషంట్లతో కాంటాక్ట్ అయిన  మరో 14 మంది జర్నలిస్టులు హోం క్వారెంటైన్ లో ఉన్నారని వారికి రూ 10 వేల చొప్పున బాంకు అక్కౌంట్లలో డబ్బులువేశామని చెప్పారు.కరోనా భారిన పడిన జర్నలిస్టులను ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని భాదితులు 8096677444, 9676647807 వాట్సాప్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యాధి పీడితులు సంభందిత ప్రబుత్వ వైద్యులనుండి ధృవీకరణ పత్రాలు అంద చేయాలని సూచించారు.
కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుండి ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఒకరిగా ఉంటూ ప్రజలకు సమాచార వాహకులుగా పనిచేసిన జర్నలిస్టులు కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తున్నదని అల్లం నారాయణ అన్నారు.కరోనా మహమ్మారి పట్ల జర్నలిస్టులు అన్ని జాగ్రత్త చర్యలు విధిగా పాటించి తీరాలని సూచించారు.సానిటైజేషన్ చేసుకోవాలని ముఖాలకు మాస్కులు తప్పని సరిగా ధరించాలని అన్నారు.

నగరంలో జర్నలిస్టు లందరికి  వైద్య పరీక్షలు

నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి వైద్య పరీక్షలు నిర్విహించ నున్నారు.మనోజ్ కుమార్ చనిపోయిన తర్వాత మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో  టియూడబ్ల్యు జే ప్రతినిధులు బృందం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాంజేందర్ ను కలిసి జర్నలిస్టులకు రోనా టెస్టులు చేయాలని విజ్ఞప్తి చేసింది. సెక్రెటేరియట్ భవన్ లో జర్నలిస్టులకు రెండు రోజుల పాటు జరిపిన పరీక్షల్లో 25 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో జర్నలిస్టు వర్గాల్లో కలవరం ప్రారంభమైంది.

డిల్లీలో తొలుత అతర్వాత హైదరాబాద్ లో 

డిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో పలువురికి తొలుత కరోనా సోకింది.వీరంతా చికిత్స అనంతరం కోలుకున్నారు.ఆ తర్వాత హైదరాబాద్ లో జర్నలిస్టులు కరోనా భారిన పడ్డారు.కరోనా పట్ల అవగాహన కల్పించడంలో కీలకంగా పనిచేసిన జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మిఖ్యమంత్రికి గతంలో లేఖ రాసారు.జర్నలిస్టులకు శానిటైజేషన్ కిట్లతో పాటు ఒక్కొక్కరికి మూడు నెలల పాటు రూ 10 వేల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.మీడియా అకాడమి వద్ద నిధుల నుండి కరానా భారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అంద చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు