గూగుల్ పే సేఫ్ -ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు సంస్థకు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయి -ఆర్ బిఐ

గూగుల్  పే ను ప్రభుత్వం నిషేదించలేదు..ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు అన్ని అనుమతులు ఉన్నాయి- ఆర్ బిఐ 
గూగుల్ పే

గూగుల్ సంస్థ కు చెందిన  ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ ‘గూగుల్‌ పే’ను భారతీయ రిజర్వు బ్యాంకు నిషేధించలేదని...రిటైల్‌ చెల్లింపుల సాధికార సంస్థ-  ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. గూగుల్ పే కు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయని ఆర్ బి ఐ కూడ నిర్దారించింది.
గూగుల్‌ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్‌ చేయలేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. గూగుల్‌ పే లావాదేవీలపై వచ్చిన పుకార్లపై సంస్థ స్పష్టత నిచ్చింది. గూగుల్‌ పే యాప్‌ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని తేల్చి చెప్పింది. తమ యాప్‌ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది. గూగుల్‌ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది.
గూగుల్‌ పే నిషేధానికి గురైందంటూ కొద్ది రోజులుగా సామాజిక మాద్యమాల్లో ఓ ఫేక్ వార్త చక్కర్లు కొడుతోంది.
ఆర్థికవేత్త అభిజీత్‌ మిశ్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి జవాబుగా.. గూగుల్‌ పే ఏ విధమైన చెల్లింపుల వ్యవస్థ - పేమెంట్ సిస్టమ్‌ ను నిర్వహించడం లేదని.. అందుకే సంస్థ పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్‌బీఐ తెలిపింది. అయితే వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు, తదితర ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు సంస్థకు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయని కూడా ఆర్‌బీఐ న్యాయస్థానానికి స్పష్టం చేసింది.
సామాజిక మాధ్యమాల్లో ఆర్‌బీఐ, గూగుల్‌ పేను నిషేధించిందంటూ ప్రచారం ఊపందుకోవటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ‘‘గూగుల్ పే ను ‘థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌’గా రిజర్వు బ్యాంకు గుర్తించింది. ఈ సంస్థ చట్టబద్ధమైనదని, దీని ద్వారా జరిగే లావాదేవీలన్నీ సురక్షితమైనవని ఆర్‌బీఐ నిర్ధారించింది.’’ అంటూ ఎన్‌పీసీఐ ప్రకటన జారి చేయడంతో స్పష్టత నిచ్చినట్లు అయింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు