విజృంభిస్తున్న కోవిడ్ -19 మహమ్మారి-మరో వైపు జంతు బలులు- నరబలి కూడ

జార్ఖండ్ రాష్ర్టంలోని కోడెర్మా జిల్లాలోని చంద్వారా బ్లాక్ పరిదిలోని ఉర్వాన్ గ్రామంలో ఏకంగా 400 గొర్రెలను బలిచ్చారు.

దేశంలో కోవిడ్-19 మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తుండగా మరో వైపు జంతు బలులు,నర బలులతో క్షుద్ర పూజల తంతులు జరుగుతున్నాయి.జనం అమాయక్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు క్షద్ర పూజలు నిర్వహించేవారు ఇలాంటి  పూజలు ప్రోత్సహిస్తున్నారు. కోవిడ్ మహమ్మారిని అరికట్టాలంటే అమ్మవారిని శాంతిప చేయాలని అందుకు రక్త తర్పరణం జరిగితే కాని అమ్మవారు శాంతించదని ప్రజలను నమ్మిస్తూ బలులతో తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ రాష్ర్టంలోని కోడెర్మా జిల్లాలోని చంద్వారా బ్లాక్ పరిదిలోని ఉర్వాన్ గ్రామంలో ఏకంగా 400 గొర్రెలను బలిచ్చారు.ఆయంలో ముందు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భజనలు జరిగాయి.మహిళలు పాటలు పాడారు. పూజా కార్యక్రమం అనంతరం నైవేద్యం పెట్టారు. అనంతరం గొర్రెలన్నింటిని ఒకటి తర్వాత ఒకటి చొప్పున వరుసగా బలి ఇచ్చారు.ఈ సంఘటన పై జాగరణ్,నవభారత్ టైమ్స్ పత్రికలు ప్రత్యేక వార్త కథనాలు ప్రచురించాయి.గ్రామంలోని దుర్గామాత ఆలయంలో  కనీసం భౌతిక దూరం కూడ పాటంచుకండ జనం ఒకరి నొకరు తోసుకుంటూ జంతుబులు ఇచ్చారు.కొందరు కోళ్ళను బలి ిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన  గ్రామస్థుల జంతుబలలు వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. అయితే గ్రామస్థుల మాత్రం ఇదంతా కోవిడ్ 19 మహమ్మారి  గ్రామానికి రాకుండా ఉండేందుకు చేసామని అమ్మావారికి జంతు బలులు ఇస్తై మహమ్మారిని గ్రామంలోకి రాకుండా కాపాడుతుందని ఇక ఏ రోగాలు గ్రామం దరి చేరవని గ్రామస్థులు తమ చర్యను సమర్ధించుకున్నారు. 'లాక్ డౌన్ నిభందనలు ఉల్లంఘించి గ్రామస్తులు జంతుబలులు ఇచ్చారు..ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాం.. బ్లాక్ స్థయి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆలయాలు తెరవవద్దని ఆదేశాలు ఉన్నా గ్రామస్థులు ఆదేశాలను ఉల్ల్ఘంఘించారు..ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపర మైన చర్యలు తీసుకుంటాం,'అని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి విజయ్ వర్మ తెలిపారు.ఈ కేసులో ఎవరిని ఉపేక్షించ బోమని ఆయన చెప్పారు.

ఒడిశాలో ఏకంగా నర బలే ఇచ్చాడు..ఓ పూజారి

ఒడిశా రాష్ర్టంలోని కోవిడ్ 19 మహమ్మారి పేరిట అమ్మవారికి ఏకంగా నరబలే ఇచ్చాడు ఓ ఆలయం పూజారి. కటక్ జిల్లా నర్సింగ్ పూర్ లో బ్రాహ్మణిదేవి ఆలయంలో 70 ఏళ్ల పూజారి సన్సారి ఓజా అనే పూజారి సరోజ్కుమా్ర ప్రధాన్ అనే 52 ఏళ్ల వ్యక్తిని దారుణంగా నరికి చంపాడు.అమ్మావారి ఆలయంలో మేనెల చివరి వారంలో జరిగిన ఈ సంఘటన సమజాన్ని విస్మయ పరిచింది.ఆలయంలో వ్యక్తిని నరికి చంపిన తర్వాత పూజారి సన్సారి ఓజా పోలీసులకు లొంగి పోయాడు.రాత్రి వేళ అమ్మవారు కళలోకి వచ్చి కోవిడ్ 19 మహమ్మారిని తరిమి వేయాలంటే నరబలి ఇవ్వాలని ఆదేశించిందని అందుకే అమ్మవారి కొర్కె తీర్చానని పూజారి పోలీసులకు చెప్పాడు. అయితే పూజారి చెప్పిన విషయం పోలీసులు నమ్మడం లేదు. ఎందుకంటే గ్రామస్థుల కథనం మరో లా ఉంది. పూజారికి హత్యకు గురి కాబడిన వ్యక్తికి మద్య మామాడి తోట విషయంలో గొడవలు ఉన్నాయని ఇద్దరి మద్య తగవులు జరిగాయని తెలిపారుపోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు జరుపుతున్నామని అత్తాఘర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి రంజన్ రాయ్ చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు