సూర్య గ్రహణంతో కరోనా నశించి పోతుందా..?న్యూ క్లియర్,ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ కేఎల్ సుందర్ కృష్ణ ఏం చెప్పాడు ?


ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ 19-నావెల్ కరోనా వైరస్ ను జూన్21న ఏర్పడే సూర్యగ్రహణం నాశనం చేస్తుందా..?సూర్యగ్రహణం ప్రభావంతో కరోనావైరస్ శక్తి హీనం అవుతుందని ఓ సైంటిస్టు చెప్పడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Covid-19 and solar eclipse

చెన్నైకి చెందిన న్యూ క్లియర్,ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ కేఎల్ సుందర్ కృష్ణ అనే సైంటిస్టు ఏం చెప్పాడంటే 2019 డిసెంబర్ 26న వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల ఏర్పడిన సూర్యగ్రహణానికి కరోనా వైరస్ కు సంబంధం ఉందని ఓ న్యూస్ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.గ్రహణం సందర్భంగా చోటు చేసుకునే విచ్ఛిత్తి శక్తి కారణంగా సూర్యగ్రహణం తరువాత విడుదలయ్యే న్యూ ట్రాన్ల కణ సంఘర్షణ ఫలితంగా కరోనా వైరస్ వచ్చి ఉండొచ్చని అన్నారు. వాతావరణంలో జరిగిన ఇంటర్-ప్లానెటరీ ఫోర్స్ వల్లనే కరోనా వైరస్ వచ్చిందని ఆయన చెప్పారు. అప్పుడు న్యూ ట్రాన్లు రియాక్ట్ అవ్వడంతోనే  పైన ఆకాశంలో బయో న్యూ క్లియర్ ఇంటరాక్షన్ ఏర్పడిందని  ఈ బయో – న్యూ క్లియర్ ఇంటరాక్షన్ కారణంగా కరోనా వైరస్ ఉద్భవించిందని చెప్పారు.
జూన్ 21 న ఏర్పడే సూర్య గ్రహణం సమయంలో 30 సెకన్లపాటు సూర్యుని చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుందని ఈ కాంతి కిరణాల వల్ల కరోనా వైరస్ శక్తి హీనం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే డాక్టర్ సుందర్ కృష్ణ చెప్పిన విషయాలతో ఇతర సైంటిస్టుులు ఎవరూ ఏకీభవించ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడ ఆయన అభిప్రాయాన్ని కొట్టి పారేసింది.సూర్య గ్రహణం సందర్బంగా సూర్యుని నుంచి వచ్చే  అతినీలలోహిత కిరణాల వల్ల ఉష్ణోగ్రత పెరగొచ్చని , అంతే కాని కరోనా మాత్రం చావదని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి నుంచి కిరణాలు భూమిని చేరేలోపే శక్తిహీనమవుతాయని,వాటి ద్వారా కరోనా నశించి పోదని అంటోంది. కరోనా వ్యాపించకుండా ఉండాలంటే మాస్క్ లు ధరించడం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు