సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన సిఎం కెసిఆర్..గ్రూప్ వన్ అధికారిగా నియామక పత్రం స్వయంగా అంద చేసిన సిఎం

భారత చైనా సరిహద్దులో తలెత్తిన ఘర్షణలో వీరమరణం పొందిన జవాన్లకు తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలో ఏ రాష్ర్ట ముఖ్యమంత్రి చేయని సహాయం చేసాడు.
తెలంగాణ రాష్ర్టానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేని విదంగా భారి మొత్తంలో 5 కోట్ల ఆర్థిక సహాయం అంద చేసారు. సంతోష్ బాబు భార్య సంతోషిని గ్రూప్ వన్ అధికారిగా నియమిస్తూ నియామక పత్రం స్వయంగా ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా అంద చేశారు.
సూర్యపేటలో సంతోష్ బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి జగ్ దీశ్వర్ రెెడ్డికి భాద్యతలు అప్పగించారు.
సంతోష్ బాబు తో పాటు వీరమరణం పొందిన ఇతర సైనిక కుటుంబాలకు కూడ ముఖ్యమంత్రి 10 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు

కల్నల్ సంతోష్ బాబు భార్యకు గ్రూపు వన్ నియామక పత్రం స్వయంగా అంచేస్తున్న ముఖ్య మంత్రి కెసిఆర్

దేశం సరిహద్దులో చైనా సైనికుల దురాక్రమణను తిప్పికొట్టి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కటుంబాన్ని సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించాడు.ఆయనతోపాటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్,మంత్రులు జగదీష్ రెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.మధ్యాహ్నం సూర్యపేటకు చేరుకున్న సిఎం కెసిఆర్ ముందుగా సంతోష్ బాబు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.సంతోష్ భార్య సంతోషి,తల్లితండ్రులు మంజుల,ఉపేందర్,సోదరి శృతిలను ఓదార్చారు.సంతోష్ పిల్లలు, అభిగ్న,అనిరుధ్ తేజలతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా తమ ఇంటికి వచ్చి ఓదార్చడంతో సంతోష్ కుటుంబ సభ్యులు కొద్ది సేపు తమ దుఖ్ఖాన్ని మరిచి పోయి సాంత్వన పొందినట్లు కనిపించారు.

దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలిచి వేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా వుంటుందని హామి ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. ఏ ఉద్యోగం చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సంతోషికే వదిలి వేసారు.  హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును,తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.
ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతోతమకు సహాయం అంద చేసి కుటుంబానికి అండగా నిలిచినందుకు సంతోష్ తల్లి దండ్రులు, ఉపేందర్, మంజుల, బార్య సంతోషి కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్  నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు  గ్యాదరి కిషోర్,  బొల్లం మల్లయ్యయాదవ్,  చిరుమర్తి లింగయ్య,  భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు