చంద్రబాబు నాయుడు కుటుంబం హోం క్వారెంటైన్ తప్పదా ?

Chandrababu home file photo

చంద్రబాబు నివాసం వద్ద డ్యూటి నిర్వహించిన కానిస్టేబుల్ కు కోవిడ్ పాజిటివ్

గుంటూరు జనరల్ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న కానిస్టేబుల్


తెలుగు దేశం పార్టి అధ్యక్షులు ఎపి మాజి ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు హోం క్వారెంటైన్ కావల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ ప్రాంతంలోని  చంద్రబాబు నాయుడు నివాసం వద్ద డ్యూటి నిర్వహించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది.దాంతో చంద్రబాబు నాయుడుతో సహా ఆయన కుటుంబ సభ్యులు విధిగా వైద్య పరీక్షలు చేయుంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.గుంటూరు జిల్లా బాపట్ల పోలీస్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ హైదరాబాద్ లోని  చంద్రబాబు నివాసం వద్ద డ్యూటి నిర్వహించి జూన్ 5 వ తేదీన బాపట్లకు వెళ్ళాడు. అతను అనారోగ్యం పాలుకాగా కోవిడ్ లక్షణాలు బయట పడ్డాయి. కుటుంబ సబ్యులు పరీక్షలు నిర్వహించగా అతనికి కోవిడ్ పాజిట్ అని తేలింది. దాంతో అతన్ని గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను హోం క్వారెంటైన్ చేశారు.
హైదరాబ్ లో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సబ్యులు కోవిడ్ నిభందనలు మేరకు హోం క్వారెంటైనా కావల్సి ఉంది. హైదరాబాద్ లో చంద్రబాబుతో సహా ఆయన సతీమని భువనేశ్వరి,కుమారుడు నారా లోకేష్ బాబు, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ తో పాటు ఇంటి పని సహాయకులు మరో ముగ్గురు ఉన్నారు.కరోనా సోకిన కానిస్టేబుల్ హిస్టరి సేకరిస్తున్నారు. ఆతనితో పాటు డ్యూటి చేసిన ఇతర కానిస్టేబుల్స్ వివరాలు కూడ సేకరిస్తున్నారు.కానిస్టేబుల్ కు డ్యూటి సమయంలో  కాని లేదా ప్రయాణంలో కాని  కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు