డాక్టర్ సాబ్ కేసు అడ్డం తిరిగింది. - డాక్టర్ సుధాకర్ పై సిబిఐ కేసు నమోదు

నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్‌ రావు పై సిబిఐ కేసు నమోదు చేసింది.ఏప్రిల్‌ 6వ తేదీన కరోనా నియంత్రణపై ప్రభుత్వం చేపట్టిన చర్యలపై విమర్శలు చేసినందుకు ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది.మే 16వ తేదీ సాయంత్రం 3.50 ప్రాంతంలో డాక్టర్‌ సుధాకర్‌ విశాఖ నగరం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో ఉన్న తన ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిలో కారు న్యూసెన్సు చేశారు.ప్రబుత్వాధి నేతలను అక్కడున్న పోలీసలను దూషిస్తూ చొక్కా విప్పుకుని జాతీయ రహదారిపై వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ దృష్యాలు చిత్రీకరిస్తున్న పోలీసు కానిసటేబుల్ సెల్ లాక్కుని నేల కేసి కొట్టాడు.
సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి పంపించిన పరిణామాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖ, ఎడిట్‌ చేసిన వీడియోను సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు.. కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.  నాలుగు రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సీబీఐ పలు విషయాలు విచారించిన అనంతరం డాక్టర్ సుధాకర్ ప్రవర్తన సరిగాలేదని ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పోలీసుల విధులకు అటంకం కలిగించాడని ప్రజా ప్రతినిధులను దూషించి ప్రజలను భ్రయ భ్రాంతులకు గురి చేశాడని సుధాకర్‌పై 188, 357 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య  మీడియాకు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు