ఎ.పి సిఎం జగన్ ను కల్సిన సిని ప్రముఖులు

Chiranjeevi Addressing the Media

సినిమా షూటింగులకు ఎపి సర్కార్ అనుమతులు
నంది ఆవార్డులు ప్రదానం చేసేందుకు అంగీకరించిన సిఎం
తెలుగు చిత్ర సీమ ప్రముఖులు మంగళవారం ఎపి సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి గూడెం లోని కాంపు కార్యాలయంలో కలిసారు.చిరంజీవి,నాగార్జున,రాజమౌళి,సురేష్ బాబు,దిల్ రాజు,పొట్లూరి వర ప్రసాద్ తదితరులు సిఎంను కల్సిన వారిలో ఉన్నారు. పలు సినిరంగ సమస్యలను సి.ఎం జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ర్టంలో సిని రంగ సమస్యలు ఏవైనా సానుకూలంగా పరిష్కరిస్తామని జగన్ మోహన్ రెడ్డి   వారికి హామి ఇచ్చారు.షూటింగులకు అనమతులు ఇచ్చారు.వాటికి సంభందించిన విధి విధానాలను మంత్రి నానితో చర్చించాలని సిఎం సిని ప్రముఖులకు సూచించారు.సినిమా ధియేటర్లు ప్రస్తుతం మూత పడి పోయాయని వాటికి ప్రస్తుతం కనీస విద్యుత్ బిల్లులు చెల్లించడం సాద్యం కాదని విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కోరినట్లు సిని నటుడు చిరంజీవి ముఖ్యమంత్రితో చర్చల అనంతరం మీడియాకు తెలిపారు.ఈ సంవత్సరం నంది అవార్డులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించాడని తెలిపారు.2019-20 సంవత్సరానికి సంభందించిన సినిమాలకు ఆవార్డులు ఇచ్చేందుకు అంగీకరించాడని ఈ సంవత్సరం వేడుకలు జరుగుతాయని చెప్పారు. సినిమాల టెకెట్లను తమిళ నాడు,కర్నాటక రాష్ర్టాలలో అమలు చేస్తున్నట్లుగా సినిమాల రేంజి ను బట్టి  ప్లెక్సి రేట్లు అమలు చేయాలని కోరామని తెలిపారు.విశాఖపట్నంలో గతంలో బై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో  200 ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించారని సిఎం దృష్టికి తీసుకు రాగా దానిని పున పరీశీలన చేస్తామని చెప్పారని తెలిపారు. రాష్ర్టంలో సినిరంగం అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు ఎల్లప్పుడు  అంద చేస్తామని జగన్ మోహన్ రెడ్డి హామి ఇచ్చారని చిరంజీవి వివరించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు