వన దేవతల దర్శనాలకు అనుమతులులేవు


మేడారం, సమ్మక్క- సారలమ్మ వనదేవతల దర్శనాలకు అనుమతులు లేవు

పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు :భక్తులు సహకరించాలి

తెలంగాణ లో ప్రసిద్ధి గాంచిన మోడారం వన దేవతల దర్శనాలకు భక్తలను అనుమతించడ ంలేదు. కోవిడ్ 19 తీవ్రత కారణంగా దర్శనాలకు అనుమతులు నిరాకరించామని మేడారం, సమ్మక్క- సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. 
మేడారంలోని సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతల దర్శనాలు ఇప్పట్లో ఉండబోవని చెప్పారు. ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి దిన దినం గండం గా మారిన తరుణంలో  ఆలయాలలో ప్రభుత్వం దర్శనాలకు అనుమతులు ఇచ్చినా మేడారంలో మాత్రం  వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాలు ప్రారంభ తేదీ జూన్ 8వ తారీకు ఉండగా,  స్థానిక పూజారులు ఎండోమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మేడారం వన దేవతల దర్శనం, ఆదివాసీ, సంస్కృతి సాంప్రదాయాలతో కూడి ఉంటుందని ఇక్కడడ పూజా కార్యక్రమాలు మిగతా ఆలయాలకు భిన్నంగా ఉంటాయి కనుక వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మేడారం వనదేవతల దర్శనానికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుండి ఎక్కువగా దర్శనానికి వస్తుంటారని పేర్కొన్నారు. ఎవరికి కోవిడ్ 19  పాజిటివ్ ఉందో, లేదో  చెప్పలేం కాబట్టి జూన్, జులై నెలలో  కోవిడ్  వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని భావిస్తన్నారని అన్నారు. లాక్ డౌన్ విధించినప్పటికి భక్తులు  మేడారం వస్తున్నారని వారిని నియంత్రించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. భక్తులు సహకరించి కోవిడ్ 19 కట్టడి అయ్యే వరకు మేడారం రావద్దని కోరారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు