పదో తరగతి పరీక్షలు రద్దు - అందరూ ప్రమోట్- ఇంటర్నల్ మార్కుల అధారంగా గ్రేడింగ్

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్
పరీక్షలు లేకుండానే అందరిని ప్రమోట్ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ విద్యార్థులకు వారి తల్లి దండ్రులకు ఆమోద యోగ్య నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను రద్దు చేశారు. పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్ధులందరిని  ప్రమోట్ చేసారు. ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్ధులను ప్రమోట్ చేశారు.
పదవ తరగతి పరీక్షలపై ముఖ్యంమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం 5, 34, 903 మంది విద్యార్ధులను ప్రమోట్ చేయనున్నారు. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ నిర్ణయిస్తారు. కరోనా తీవ్రత నేపథ్యంలో విద్యార్ధులకు కరోనా సోకితే బాధ్యులెవరని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వం అన్ని విషయాలు కూలంకశంగా చర్చింది ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో రిస్క్ తీసుకునే కన్నా విద్యార్ధులను ప్రమోట్ చేయడం ఉత్తమమని నిర్ణయించుకుని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జెక్టులకు గాను 11 పేపర్లు రాయాల్సి ఉంది. ఇందులో మూడు పేపర్ల పరీక్షలు నిర్వహించారు. మిగతా ఎనిమిది పేపర్లకు పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేసారు.
పదో తరగతి పరీక్షల విషయంపై గత కొద్ది రోజులుగా హైకోర్టులో  విచారణ జరుగుతోంది.
ఇతర రాష్ర్టాలలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన రీతిలో తెలంగాణలో కూడ రద్దు చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. కరోనానేపద్యంలో పరీక్షలు ఎట్లానిర్వహిస్తారో తెలియ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిహెచ్ఎంసి జంట నగరాలు మినహా ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించవచ్చిన హైకోర్టు సూచించింది. జిల్లాలలో నిర్వహించి జంట నగరాల్లో వాయిదా వేయడం వల్ల ప్రయోజనం ఉండదని రాష్ర్ట వ్యాప్తంగా పరీక్షలు రద్దు చేస్తు నిర్ణయం తీసుకున్నారు.

వృత్తి విద్యా కోర్సులు మినహాయించి సాధారాణ డిగ్రీ, పీజీ పరిక్షల నిర్వహణపైన  విషయంలోకూడ  త్వరలోనే  ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు