ఎస్...ఊపిరాడకుండా చేసి జార్జి ఫ్లాయిడ్ ను చంపేసారు...శవరీక్ష నివేదికలో నిజాలు బట్ట బయలు

జార్జ్ ఫ్లాయిడ్ శవ పరీక్షలో షాకింగ్ నిజాలు
ఊపిరాడక పోవడం వల్లే ఫ్లాయిడ్ మరణించాడు
 ఫ్లాయిడ్  కరోనా పాజిటివ్  పేషంట్పోలీసులు గొంతు నొక్కి చంపిన నల్ల జాతి పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ శవ పరీక్షలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.ఫ్లాయిడ్ మృతికి పోలీసులు చూపిన కారణాలు తప్పని తేలింది.ఊపిరాడక పోవడం వల్లే ఫ్లాయిడ్ మరణించాడని శవపరీక్షలో తేలింది.అంతే కాదు ఫ్లాయిడ్  కరోనా పాజిటివ్  పేషంట్ అని కూడ శవ పరీక్షలో వెలుగు చూసింది. జార్జి ని పోలీసు ఎట్లా చంపాడో సజీవ దృష్యం ప్రపంచం అంతా చూసింది.నూటికి నూరు శాతం  ఇప్పడు శవ పరీక్ష లో  అవే నిజాలు  వెలుగు చూశాయి.శవ పరీక్షలో అసలు వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేయని  క్లినికల్ ఎగ్జామినర్లను ప్రశంసించి తీరాలి.హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ కార్యాలయం విడుదల చేసిన సుదీర్ఘమైన 20 పేజీల నివేదిక జార్జ్‌ కుటుంబ సబ్యుల అనుమతితో వెల్లడించారు.
‘మెడపై తీవ్రమైన ఒత్తిడి వల్లే ఫ్లాయిడ్‌ మరణించాడు. అతడు మరణించిన తీరును బట్టి దీన్ని నరహత్యగా పేర్కొనవచ్చు’అని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్‌ పేర్కొన్నారు. అవును ఇది ఖచ్చితంగా నర హత్యే...శ్వేత జాత్యహంకారం నల్ల జాతీయున్ని బలి గొన్న నరబలి ఇది.
జార్జి ఫ్లాయిడ్ ను అమెరికా పోలీసులు ఎట్లా చంపారో దానికి సంభందించిన వీడియోను ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూశారు. అమెరికా పోలీసు వాహనం పక్కన కింద పడి ఉన్న ఫ్లాయిడ్ మెడపై మోకాలు మడిచి అనించి మోకాలితో మెడను వత్తుతున్న పోలీసు...మరో వైపు ఫ్లాయిడ్ ను కదలకుండా బిగించి పట్టుకున్న మరో పోలీసు.... గిల గిలా కొట్టుకుంటు  ప్రాణాలు విడిచిన ఫ్లాయిడ్ శ్వేత జాతి అమానవీయానికి  బలి పశువు అయిన మానవత్వం. ఫ్లాయిడ్ మూలుగుతూ ఊపిరిఆగి ప్రాణం పోతుంటే  పైశాచిక అనందం అనుభవించిన పోలీసు వికృత చేష్టలు చూసి ప్రపంచం నివ్వెర పోయింది. అమెరికా పోలీసు జాత్యాహంకారానికి పరాకాష్టగా నిలిచిన ఈ మాయని మచ్చకు మించిన సజీవ సాక్షం ఇంకా ఏం కావాలి ? మనిషిని మృగానికంటే హీనంగా చంపిన పోలీసు పైశాచికత్వానికి ఏ శిక్ష విధించినా తక్కువే.
ఫ్లాయిండ్ ను చంపి అమెరికా పోలీసులు వాస్తవాలు కప్పి పుచ్చుకునేందుకు ఫ్లాయిడ్‌ ‘ఫెంటనిల్‌ ఇన్‌టాక్సికేషన్’‌, ‘మెథమ్‌ఫెటమైన్‌’ అనే డ్రగ్స్‌ తీసుకున్నట్లు నివేదికలో పొందు పరిచారు.అయితే శవ పరీక్షలో డ్రగ్స్ తీసుకున్న లక్షణాలు ఏవి కనిపించ లేదని....ఫెంటనిల్‌ ఇన్‌టాక్సికేషన్‌ వల్ల తీవ్రమైన శ్వాసకోశ మాంద్యం,మూర్ఛ లక్షణాలు ఉంటాయని..కానీ ఫ్లాయిడ్‌లో ఇవేవి కనిపించలేదని నివేదికలో తెలిపారు. ఊపిరాడకపోవడం వల్లే ఫ్లాయిడ్‌‌ మరణించాడని ఆండ్రూ బేకర్‌ స్పష్టం చేసారు. ఫ్లాయిడ్ కు కరోనా పాజిటివ్ అయినా ఆయన శరీరంలో ఆ లక్షణాల ప్రభావం లేదని చెప్పారు.
జాత్యాహంకారం మాటున దాగిన అమెరికా పోలీసు కృూరత్వం ఇప్పడు ప్రపంచం ఎదుట చేతులు కట్టుకుని దోషిగా నిలబడక తప్పలేదు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు