పేద కళాకారులకు ఎన్ఆర్ఐ ల సహాయం


వరంగల్ ఎన్ ఆర్ ఐ ఫోరం లండన్ యుకె వారి సహకారంతో సోమవారం వరంగల్ నగరంలోని పేద కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణి జరిగింది. టాంక్ బండ్ రోడ్  విలియమ్ కారి బాప్టిస్ట్ హైస్కూల్ లో  వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ చేతుల మీదుగా కళాకారులకు నిత్యావసర సరుకులు పంపణి చేసారు. జబర్దస్త్ ఫేం రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తిక్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పేదకళాకారులకు 150 మందికి నిత్యావసర సరుకులు పంపణి  చేసారు. కరోనా కష్ట కాలంలో  లండన్ లో ఉన్న ఎన్ఆర్ ఐ సబ్యులు తమ స్వంత జిల్లాలోని వారికి సహాయ పడటం అభినందనీయమని ఎంపి దయాకర్ అన్నారు. వరంగల్ ఎన్ ఆర్ ఐ ఫోరం లండన్ యుకె ప్రెసిడెట్ శ్రీధర్ నీల, ఫౌండర్ పస్నూరి కిరణ్, జనరల్ సెక్రెటరి భాస్కర్ పిట్టల తదితరులకు కళాకారులు కృతజ్ఞతలు తెలియ చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు