ఆపిల్ పండ్లు పండించిన రైతు --సిఎం కెసిఆర్

Apple farmer giving Apples to CM KCR
తెలంగాణలో తొలిసారి ఆపిల్ పండ్లు పండించిన కొమురం భీం జిల్లా రైతు శ్రీ కేంద్రె బాలాజి  తాను పండించిన ఆపిల్తొ పండ్లను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అంద చేసారు.  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ను కల్సి ఆపిల్ పండ్ల మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆపిల్ సాగు చేసిన రైతులు ఆన తెచచిన ఆపిల్ పండ్లను చూసి సిఎం ఖుషి అయ్యారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాలాజీని మనస్పూర్తిగా అభినందించారు. తెలంగాణ నేలల విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఉదాహరణ అన్నారు. ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న వారికి ముఖ్యమంత్రి ఈ ఆపిల్ పండ్ల రుచి చూపించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామలో 2 ఎకరాల్లో హెచ్ఆర్ 99 వెరైటి ఆపిల్ పంటను సాగుచేసినట్లు రైతు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి  ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు