లవ్ స్టోరీ విడుదలకు ముందే కాసుల పంట

Love Story


నాగ చైతన్య  హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న లవ్ స్టోరి సినిమా విడుదలకు ముందే కాసులపంట పండించింది. ఈ సినిమా మరో రెండు నెలల తర్వాత సినిమా హాల్స్ తెరిస్తే విడుదల కానుంది. కరోనా పరిస్థితులు ఎట్లా ఉండ బోతున్నాయో ధియేటర్లు తెరుస్తారా లేదా అనేది ఇప్పటికైతే ఎవరి ఊహకందని విషయం. కాని  లవ్  స్టోరి  కోసం యంగర్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఫిదా వంటి సక్కెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ సినిమా శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్  తదితర నాన్ తియేట్రికల్ రైట్స్ ద్వారా 16 కోట్ల వ్యాపారం జరిగినట్లు టాక్ ఉంది.ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిజిటల్ రైట్స్ ని అల్లు అరవింద్ ఆహా యాప్ కోసం దక్కించుకోగా శాటిలైట్ హక్కుల్ని స్టార్ మా స్వంతం చేసుకుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు