ఈ బాబా పోతు..పోతూ..భక్తులందరికి కరోనా అంటించాడు

చేతులపై ముద్దులు పెట్టి కరోనా నయం చేస్తానన్న- కిస్సింగ్ బాబా
కోవిడ్ -19 తో మరణం
అనేక మందికి సోకిన కోవిడ్ -19 ( కరోనా )

గడ్డాలు మీసాలు పెంచుకుని నుదుట విభూది పూసు కుంటేచాలు..సాష్టాంగపడి పోయే అమాయకులున్న దేశం మనది.ఎలాంటి బాపతు బాబాలైనా ఫకీర్లైనా వారికి మహిమలు ఉంటాయని తెగ నమ్ముతుంటారు. భక్తుల అతి విశ్వాసమే మధ్యప్రదేశ్ లో కొంప ముంచింది.రత్లాం జిల్లా నాయపురం ప్రాంతంలో తనకు తాను దైవాంశ సంభూతిడిగా ప్రకటించుకున్న అస్లాం బాబా అనే బాబా నిర్వాకం కారణంగా అనేక మంది కరోనా భారిన పడ్డారు.ఇతన్ని కిస్సింగ్ బాబా పిలుస్తారు.ఈ బాబాకు జూన్ 3 న కరోనాపాజిటివ్ గా నిర్దారణ జరిగింది.తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న బాబాకు పరీక్షలు నిర్వహించగా పాటిజివ్ అనితేలింది.ఆ తెల్లవారే ఆయన మరణించాడు. అయితే బాబా మరణించిన అనంతరం ఆ ప్రాంతంలో అనేక మంది కరోనా భారినపడినట్లు గుర్తించారు.ఆయన ఆశ్రమంలో ఏడుగిరితో పాటు ఆయన్ని కల్సిన మరో 18 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది . కేసులు ఇంకా పెరిగే ఆవకాశం ఉందని అధికారులు తెలిపారు.కిస్సింగ్ బాబా వ్యవహారం ఆయన చనిపోయిన తర్వాతే అధికారులకు తెల్సింది.చాలాకాలంగా తాంత్రిక పూజలు చేస్తూ ప్రజలను నమ్మించిన ఈ బాబా కరోనా రోగాన్నితన ముద్దులతో నయంచేస్తానని నమ్మించాడు.అది నమ్మి ఆయన జగ్గరకు వచ్చిన భక్తుల చేతులకు ముద్దులు పెట్టి పూజలు చేయించాడని అధికారులు తెలిపారు.కిస్సింగ్ బాబా చేసిన  పనికి అనేక మందికి కరోనా అంటుకుంది.బాబా దగ్గరకు వెళ్లిన వారిలో కొందరు ప్రభుత్వ అధికారులు కూడ ఉన్నట్లు వెలుగు చూసింది.
నాయపురం ప్రాంతంలో సుమారు 200 మందిని క్వారెంటైన్ చేసినట్లు రత్లాం జిల్లా పోలీస్ సూపరింటిడెంట్ గౌరవ్ తివారి మీడియాకు తెలిపారు. బాబాను కల్సిన వారందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు