వారం పాటు ఢిల్లి దారులన్ని బంద్....నిత్యావసరాల సరఫరా కు మినహాయింపు


వారం రోజులపాటు ఢిల్లి దారులన్ని మూసివేశారు. సరిహద్దులో గల హర్యానా, ఉత్తర ప్రదేశ్ మార్గాలను మూసివేసినట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం ప్రకటించారు.ఆన్ లైన్ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయం ప్రకటించారు.నిత్యావసర సరుకుల రవాణా వాహనాలకు ఇతర అవసరాల కోసం  అనుమతులు ఉన్న వాహనాలకు అనముతులు ఉంటాయని చెప్పారు. వారం రోజుల అనంతరం ప్రజల అభిప్రాయం మేరకు సరిహద్దులు తెరలవాలా లేదా అనే విషయం ఆలోచిస్తామని చెప్పారు.ప్రజలు తమ అభిప్రాయాలను 8800007722 వాట్సాప్ నెంబర్ కు పంపించాలని కోరారు.అట్లాగే  delhicm.suggestions@gmail.com కి ఈ మెయిల్ చేయొచ్చని చెప్పారు.
డిల్లీలో వాణిజ్య సముదాయాలు షాపులు, సాలున్లకు అనుమతులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సరి బేసిసంఖ్య లో ఇప్పటి వరకు షాపులకు అనుమతులు ఇచ్చామని అయితే కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు జారి చేయనందున షాపులన్ని తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చామని చెప్పారు. అట్లాగే వాహనాల్లో ప్రయాణీకుల సంఖ్యా పరిమితులను కూడ ఎత్తి వేసినట్లు చెప్పారు. రాత్రి 9 గంటల నుండి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ  మాత్రం కొనసాగుతుందని తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు