నేల మాలిగలో తల దాచుకున్న ట్రంప్....వైట్ హౌజ్ ఎదుట నల్ల జాతీయుల విధ్వంస కాండ


ఆఫ్రికన్ అమెరికన్ మృతికి అమెరికాలో చెల రేగిన ఆఁదోళనల సమయంలో ఆ దేశాద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడ తల దాచుకున్నాడో తెల్సా.. ఆపద సమయాల్లో తల దాచుకునే నేల మాలిగలో.ఈ వార్త అమెరికా మీడియా వెల్లడించింది కాక పోతే ట్రంప్ ను  ఒక్కరినే సురక్షిత ప్రాంతానికి చేర్చారా ఆయన కుటుంబ సబ్యులను కూడ చేర్చారా అనే విషయంలో క్లారిటి లేదు. వాషింగ్టన్ ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్  మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న నిరసన జ్వాలలు మిన్నంటి పోయాయి. ఆందోళన కారులు ఏకంగా అమెరికన్ ప్రెసిడెంట్ నివసించే వైట్ హౌజ్ వద్దకు వచ్చి నానా భీభత్సం సృష్టించారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు చాలా సేపు కష్టపడాల్సి వచ్చింది.బాష్ప వాయు గోళాలు ప్రయోగించి ఆందోళన కారులను చెదర గొట్టారు.సుమారు వేయి మంది నిరస న కారులు వైట్ హౌజ్ కు  ఉత్తర దిశగా ఉన్న లాఫాయెట్ పార్క్ కు చేరుకుని నినాదాలతో ప్రారంభించి చివరకు విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేసి వైట్ హౌజ్ లోనికి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించారు.బారికేడ్లకు నిప్పంటించారు. అమెరికా జాతీయ జెండాను దగ్దం చేశారు.ఇంకా రాళ్లు కూడ రువ్వే ప్రయత్నం చేసారని అమిరికా మీడియాలో వార్త కథనాలు వచ్చాయి.
ఆందోళన తీవ్ర రూపం దాల్చక పోయినా ముందు జాగ్రత్త చర్యగా వైట్ హౌజ్ లో ఉండే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ని నేల మాలిగ (బంకర్) లోకి తరలించారు.ఆందోళన కారులను చెదర గొట్టి ప్రశాంత పరిస్థితులు నెల కొనే వరకు  గంటకు పైగా  ట్రంప్ బంకర్ లోనే గడిపారని అమెరికా మీడియా పేర్కొంది.అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నేల మాలిగలో తల దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే నిరసన కారుల ఆందోళన ఎంత తీవ్ర రూపంలో కొనసాగిందో ఊహించుకోవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు