ఎపిలో పదో తరగతి,ఇంటర్ సప్లిమెంటరి పరీక్షలు రద్దు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ శనివారం తెలిపారు.పరీక్షలకన్నా విద్యార్థుల ఆరోగ్యం ప్రధానమని అందుకే పరీక్షలు రద్దు చేసామని చెప్పారు.పదో తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్‌లో ఫెయిల్‌ ఫస్టియర్‌,సెకండియర్‌ విద్యార్థులంతా పాస్‌ అయినట్టు మంత్రి ప్రకటించారు.తెలంగాణ, తమిళనాడు, పుద్దుచ్చేరి రాష్ర్టాలతో పాటు మరి కొన్ని రాష్ర్టాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేశాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు