పశ్చిమ బెంగాల్ లో అమెజాన్,బిగ్ బాస్కెట్ ద్వారా లిక్కర్ ఆన్ లైన్ విక్రయాలు


Liqour on line sale


ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయాలకు క్రమంగా దేశంలో దారులు తెరుచు కుంటున్నాయి.తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో అమెజాన్,బిగ్ బాస్కెట్ ఇ కామర్స్ ధిగ్గజ కంపెనీలు ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయాలు జరిపేందుకు ఆ రాష్ర్ట బేవరేజెస్ కార్పోరేషన్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.ఇప్పటికే దేశంలో స్విగ్గి,జోమాటో ద్వారా కొన్ని నగరాల్లో మద్యం డోర్ డెలివరి జరుగుతోంది.ముంబై,న్యూడిల్లీ నగరాల్లో డోర్ డెలివరి జరుగుతోంది.ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయాలకు పశ్చిమ బెంగాల్ రాష్ర్టం అనుమతి ఇవ్వడంతో ఇక మిగతా రాష్ర్టాలు కూడ ఈ విధానం అనుసురించే అవకాశం ఉంది.
కరోనా కారణంగా వరుసగా లాక్ డౌన్ విధించి సడలింపులు ఇచ్చిన అనంతరం మద్యం షాపుల వద్ద జనం కిలోమీటర్ల  మేర బారులు తీరారు.షాపుల వద్ద పోలీసులను కాపలా పెట్టి తొక్కిస లాట జరగకుండా చూడాల్సి వచ్చింది.కరోనా గందర గోళంలో మద్యం షాపుల వద్ద  నేరుగా అమ్మకాలకు బదులు ఆన్ లైన్ ద్వారా విక్రయాలు చేయాలని సుప్రీం కోర్టు సూచనుల చేసింది.ఈ నేపద్యంలో దేశంలో ఇతర రాష్ర్టాలలోకూడ ఆన్ లైన్ విక్రయాలకు విధానాలు రూపొందించే పనిలో ఉన్నారు.
లాక్ డౌన్ కాలంలో అమెజాన్ నిత్యావసర సరుకులను డోర్ డెలివరి చేసింది.ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలు వాహనాల విడిభాగాల వరకు అన్ని విక్రయించే అమెజాన్ దేశంలో అతి పెద్ద నెట్ వర్క్ కలిగి ఉంది.బిగ్ భాస్కెట్ కూడ అమె జాన్ తో ఆన్ లైన్ విక్రయాల్లో పోటీ పడుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు