ద్యావుడా!..నేను రేవంత్ మాట ఎత్త లేదు..పోసాని కృష్ణ మురళి!


సెటైర్....సిన్మా పంచ్...పోలిటికల్ బంచ్
ఏం జరిగిందో కాని పోసానికి బాగా తడిసి పోయేలా చేసి ఉంటారని జోకులు




తెలుగు సినిమా నటుడు,రచయిత,దర్శకుడు,పోసాని కృష్ణ మురళి పలు సినిమాల్లో విలన్ కారెక్టర్ గా జోకర్ గా రక్తికట్టించే పాత్రల్లో మెప్పు పొందారు.ఆయన విలన్ పాత్రలో నటించినా జోకులు పేల్చుతుంటారు.మొదట పంచ్ డైలాగులతో పంచె లూడుతాయంటాడు...హీరో చెంపచెల్లు మనిపిస్తే...వెంటనే  లొంగి పోయి ద్యావుడా....అంటాడు. కృష్ణ మురళి సినిమాల్లో కారెక్టర్స్  అన్ని ఇట్లాగే ఇప్పటి సీన్ లాగే  సిమిలర్ గా ఉంటాయి.
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు అయినప్పటి నుండి కెసిఆర్ కు ఆయన కుటుంబానికి ఫిదా అయిన కృష్ణ మురళి పొలిటికల్ స్టేట్ మెంట్లతో పలు మార్లు కెసిఆర్ పాలనా తీరును తెగమెచ్చుకున్నాడు.కెసిఆర్ ఆయన కుటుంబ సబ్యుల దృష్టిలో పడి వారి చేత శభాష్ అనిపించుకోవాలని ఈ మద్య కాంగ్రేస్ ఎంపి రేవంత్ రెడ్డి పై కూడ పొలిటికల్ సెటైర్లు విసిరాడు.
జన్వాడ ఫాం హౌజ్ విషయంలో రేవంత్ రెడ్డికి కెటిఆర్ కు మద్య వ్యవహారం బాగా ముదిరి పోయింది. అక్రమంగా నిభందనలకు విరుద్దంగా నిర్మించాడంటూ రేవంత్ రెడ్డి కెటిఆర్ ను బయటికి లాగాడు.ఇది రాజకీయ నాయకులకు సహజమే.ఒకరి హోల్స్.. మరొకరు వెదుక్కోవటం వారికి పరిపాటి.ఇదే తమకు పెద్ద మైలేజి ఇస్తుందని భ్రమిస్తుంటారు.ఈ ఎపిసోడ్ లో ఫాం హౌజ్ ను డ్రోన్లతో చిత్రీకరించాడన్న ఆరోపణలపై పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోద చేయగా రేవంత్ రెడ్డి జైళుకెళ్ళి వచ్చాడు.రేవంత్ రెడ్డి కెటిఆర్ ను వదలకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశాడు. కెటిఆర్ తో సహా ప్రభుత్వానికి జహెచ్ఎంసికి ఎన్జీటి నోటీసులు జారి చేసింది.ఈ ఎపిసోడ్ కొనసాగుతుండగా మద్యలో అప్రస్తుత ప్రసంగకుడి లెక్క పోసాని కృష్ణ మురళి ఎంటర్ అయ్యాడు.
కెసిఆర్,కెటిఆర్,కవిత పరీశ్ రావులను తెగ పొగిడేసాడు. వారే భావి బారత తెలంగాణ భవిష్యత్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన వాడని ఇలాంటి వ్యక్తులను తానెప్పుడు చూడ లేదని పొలిటికల్ పంచ్ ఇచ్చాడు.
‘ఎన్జీటీ దర్యాప్తునకు ఆదేశిస్తే..మంత్రి పదవికి రాజీనామా చేయమనడం ఏంటి? ఇది ఎక్కడి లాజిక్ నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి రూ.50లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఈరోజుల్లో ఇలా దొరికిన వ్యక్తి ఎవరూ లేరు. ఇలాంటి వ్యక్తి..కేటీఆర్ ను రాజీనామా చేయమనడం ఏంటి? ఉన్న మంచి రాజకీయ నాయకుని పై బురదజల్లడం ఏంటి? కేటీఆర్, హరీష్ రావు నిజాయితీపరులైన రాజకీయనేతలు. వీళ్ళే భవిష్యత్ తెలంగాణ కు రెండు కళ్ళ లాంటి వారు.’ ని కృష్ణమురళి అన్నారు. అంతేకాదు కేటీఆర్ అవినీతి ని ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే రేపటి నుంచి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతానని కూడ అన్నారు. ప్రాజెక్టుల పై కాంగ్రేస్ నేతల ఆరోపణలపై కూడ మాట్లాడారు.నాగార్జున సాగర్ కమీషన్ల కోసమే కట్టారా అని ప్రశ్నించారు.
పోసాని కృష్ణ మురళి డైలుగులు బాగా పేలిపోయాయి.కాని వెంటనే ఆయనకు చెమటలు పట్టడం మెదలయ్యాయి. రేవంత్ రెడ్డి అభిమానులు కృష్ణ మురళి వెంట పడి ట్రోల్ చేసారు.ఆ భాదకు తట్టుకోలేక పోసాని మాట మార్చాడు.అమ్మమ్మా నేను రేవంత్ రెడ్డి ని పల్లెత్తు మాట అన లేదని రామ..రామ అసలు ఆయన  పేరే ప్రస్తావించ లేదని బుకాయిస్తూ స్టేట్ మెంట్ జారి చేసాడు.
"నాకు తెలిసి గానీ, తెలియక గానీ నా లైఫ్‌‌లో రేవంత్‌ రెడ్డిగారిని వ్వక్తిగతంగా గానీ, రాజకీయ పరంగా కానీ ఎప్పుడూ కామెంట్‌ చేయలేదు.ప్రతిపక్షం వారు విమర్శ చేసేటప్పుడు,సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుందని మాత్రమే అన్నాను. రేవంత్‌ రెడ్డి గురించి నేను అసలు మాడ్లడలేదు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అయినా సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఛానల్స్‌లో బాగా ట్రోల్‌ అవుతున్నాయి కాబట్టి ,ఇది నా బాధ్యతగా తీసుకొని రేవంత్‌ రెడ్డికి , ఆయన అభిమానులకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఇది నా తప్పుగానే భావించి, ఈ తప్పును సరిదిద్దుకుంటాను",అంటూ పోసాని తన వివరణ పత్రంలో పేర్కొన్నాడు.
పోసాని దెబ్బకు..పోసుకుని ఉంటాడని రేవంత్ రెడ్డి అభిమానులు గుస గుసపోతున్నారు.ఇంతకి రేవంత్ రెడ్డి అభిమానులు పోసానికి ఎట్లా తలంటారో తెలియదు..తెర వెనక ఎం జరిగిందో పోసాని కూడ బయటికి చెప్పు కోలేదు..కాని   దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి దిగిరాక తప్పలేదు మరి.ఎందుకొచ్చిన గొడవ పోసాని..రోట్లోతల దూరిస్తే ఏం జరుగుతుందో ఇప్పటికైనా అర్దం అయిందా అంటూ జోకులు వేస్తున్నారు.
పోసాని..పోసు కుని ఉంటాడని అంతా జోకులు పేల్చుతున్నారు.సో..పోసాని ఇక  పొలిటికల్ జోళికి వెళ్ళకుండా..ఆ డైలాగులు ఏవో సిన్మాల్లో చెప్పుకుంటే లాగులు తడవకుండా..ఉంటాయంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు