కెసిఆర్ గ్రాఫ్ ఎందుకు పడి పోయినట్లు? 2019 లో టాప్ 2020 లో 16 వస్థానంగతేడాది టాప్ రాంకులో నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గ్రాఫ్ ఈ ఏడాది సి-వోటరు (C-Voter Survey) నిర్వహించిన సర్వేలో అమాంతం పడిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగ మారింది.ఎందుకో కాని ఈ ఏడాది కెసిఆర్ రాంకు 16 వ స్థానానికి పడి పోయింది.సి వోటరు ప్రతి ఏటా అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సహా ప్రధాన మంత్రి ఇతర  జాతీయ నేతల పాపులారిటీపై సర్వే నిర్వహిస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 65శాతం మంది మద్దతు లభించగా ఒరిస్సా ముఖ్యమంత్రి దేశంలో అత్యధికంగా 95.6 శాతం మద్దతుతో టాప్ రాంకులో నిలిచారు.అతర్వాత  రెండో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 93.95శాతంతో చత్తీశ్ ఘడ్ ముఖ్యమంత్రి 92.73శాతంతో మూడోస్థానంలో నిలిచారు.పొరుగు తెలుగు రాష్ర్టం ముఖ్యమంత్రి వై.ఎస్ ఎజగన్మోహన్ రెడ్డి 83.6 శాతంతో నాలుగో స్థానంలో నిలిచారు.గతేడాది -(2019)పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ సిఎం కెసిఆర్ 79.2శాతం మద్దతుతో టాప్ రాంకులో  నిలిచారు.కెసిఆర్ కు ఏడాది కాలంలో ఇంతగా గ్రాఫ్ పడిపోవడంపై పలు విశ్లేషణలు చేస్తున్నారు.
గతేడాది కెసిఆర్ చిత్ర పటాలకు పాలు పోసి సంబరాలు జరిపిన టిఆర్ ఎస్ శ్రేణులు ప్రస్తుతం  గ్రాఫ్ ఎందుకు పడి పోయిందో మాట్లాడే పరిస్థితి లేదు. ఓరకంగా పార్టి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదికి తమిళ నాడు,కేరళ,జమ్ముకాశ్మీర్ తక్కువ శాతం మద్దతు లభించగా రాహుల్ గాంధీకి గోవా,కేరళ తమిళనాడు రాష్ర్టాలలో సంతృప్తి కరమైన మద్దతు నరేంద్ర మోది కన్నా ఎక్కువగా లభించింది.నరేంద్ర మోదీకి అంధ్రలో
78.65 శాతం,తెలగాణ లో 68.96 శాతం సంతృప్తి కర మద్దతు లభించింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు