కోవిడ్ 19 భారిన పడి తెలంగాణ జర్నలిస్ట్ మనోజ్ మృతి

కోవిడ్ 19 భారిన పడి తెలంగాణ జర్నలిస్ట్ మనోజ్ ఆదివారం మరణించాడు. గాంధి ఆసుపత్రిలో కొద్ది  రోజులుగా కోవిడ్ 19 భారినపడ్డ మనోజ్ చికిత్సపొందుతున్నాడు. కోవిడ్ 19 తో పాటుగా మిస్ర్తినియా గ్రేవీస్ అనే వ్యాధి సోకిందని గాంది ఆసుపత్రి సూపరింటిడెంట్ రాజారావు తెలిపారు. ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో వెంటలేటర్ పెట్టి చికిత్స అందించామని చెప్పారు.
మనోజు పలు టివి చానెళ్ళలో క్రైం రిపోర్టర్ గా పనిచేశాడు. ప్రస్తుతం టివి -5 లో క్రైం రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు.
మనోజ్ హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట ప్రాంతానికి చెందినవాడు. ఎనిమిది నెలల క్రితమే అతనికి వివాహం జరిగింది.
మనోజ్ మృతి పట్ల జర్నలిస్టు సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.మనోజ్ మృతి  బాధాకరమైన విషయ మని మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మనోజ్ కుటుంబ సబ్యులకు ప్రగాఢ సాను భూతి వ్యక్తం చేశాడు. మనోజ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం అని తెలిపారు.జర్నలిస్టులు విధి నిర్వహణలో అప్రమత్తంగ ఉండాలని అన్నారు. కరోనా బారిన పడి ఓ తెలుగు జర్నలిస్ట్ మృత్యువాత పడటం ఎంతో కలుచి వేసిందన్నారు. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేనందున జర్నలిస్టులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని మనోజ్ మరణం హెచ్చరిస్తుంది అని అన్నారు. మనోజ్ కుటుంబ సభ్యులు దైర్యంగా ఉండాలన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు