కరోనా కట్టడికి జాతీయ మార్గదర్శకాలు

కరోనా వ్యాప్తి నియంత్రణకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని జాతీయ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రజలంతా కచ్చితంగా పాటించాలని సూచించింది. అవి ఏమంటే..

బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరం. ఇందుకు రాష్ట్రాలు, స్థానిక యంత్రాంగాల చట్టా లు, నిబంధనలు అమల్లో ఉంటాయి.

 పబ్లిక్‌ ప్రదేశాల్లో, ప్రయాణ సమయాల్లో భౌతిక దూరం పాటించాలి.

వివాహాల్లో భౌతిక దూరం పాటించాలి. 50 మంది కంటే ఎక్కువ అతిథులు ఉండరాదు.

 అంతిమ సంస్కారాల సమయంలోనూ భౌతిక దూరం పాటించాలి. 20 మంది కంటే ఎక్కువ హాజరుకారాదు.

 బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, పొగాకు, గుట్కా వినియోగాన్ని అనుమతించరు.

 దుకాణాలు రెండు గజాల దూరం నియమాన్ని పాటించాలి. ఐదుగురు కంటే ఎక్కువ మందిని దుకాణాల వద్ద అనుమతించరాదు.
పని ప్రదేశాల్లో అదనపు మార్గదర్శకాలు

 వీలైనంత వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రక్రియను అనుసరించాలి.

 కార్యాలయాలు, మార్కెట్లు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాల పని గంటలు నిర్ధిష్టంగా కాకుండా అస్థిరంగా ఉండాలి.
  కార్యాలయాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, కామన్‌ ఏరియాల్లో థర్మల్‌ స్క్రీనింగ్, హ్యాండ్‌ వాష్, శానిటైజర్‌ వంటి సదుపాయాలు ఉండాలి.

 డోర్‌ హ్యాండిళ్లు సహా సిబ్బంది తాకేందుకు అవకాశం ఉన్న అన్నింటినీ, కామన్‌ వసతులను, మొత్తం పని ప్రదేశాన్ని తరచుగా, శానిటైజ్‌(క్రిమి రహితం) చేయాలి.

 సిబ్బంది మధ్య భౌతిక దూరం ఉండేలా కార్యాలయ ఇన్‌ఛార్జులు శ్రద్ధ తీసుకోవాలి. అలాగే షిఫ్టుల మధ్య తగినంత అంతరం ఉండేలా జాగ్రత్తపడాలి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు