కేస్ స్టడి!?నమస్తేతెలంగాణ
(శిరందాస్ ప్రవీణ్‌కుమార్)
హైదరాబాద్- టీ మీడియా:క్యా ముసీబత్ హై బై…కేస్ స్టడి!?రాజధాని భూములపై వేలకొద్దీ కేసులు..
కబ్జాలపై రాజముద్రకు తహతహ
యూటీలు, గవర్నర్ పాలనలు అందుకే!
తెలంగాణ రాష్ట్ర సమీక్షకు మోకాలడ్డే యత్నాలు
‘ప్రతి రోజూ ఎంతోమందికి నోర్లు పండిస్తుంటానా బతుకే పండ
నేను అమ్మిన కింగ్ సైజ్ సిగ్టరేట్
నా గరీబీ బీడీ వైపు చీదరింపుగా చూస్తున్నది
గోడమీద ఉమ్మేసిన పాన్ మరకరక్క..’
వలసాధిపత్యం కింద నలిగిన హైదరాబాద్ సామాన్యుడి వ్యథకు ఓ ఉర్దూ కవి ఇచ్చిన అక్షర రూపమిది..
హైదరాబాద్ నగరాన్ని వదలడానికి సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు ససేమిరా అనడం వెనుక ఏముంది? తెలంగాణ అంతటా సీమాంధ్రులు నివసిస్తున్నా ఒక్క హైదరాబాద్ పాలన గవర్నర్‌కో లేక కేంద్రానికో అప్పగించాలనే డిమాండ్ వెనక.. చివరకు భూ కేటాయింపులేవీ కొత్త ప్రభుత్వాలు పునస్సమీక్షించకూడదనే నిబంధన కావాలనడం వెనక ఏ ఆకాంక్ష ఉంది?.. వీటన్నిటికీ జవాబు హైదరాబాద్ నగర కోర్టుల్లో దొరుకుతుంది. హైదరాబాద్ పాలన కేంద్రానికివ్వాలనే డిమాండ్‌కు మూలమెక్కడో ఈ కేసుల సంఖ్య వాటి విలువ చూస్తే బహిర్గతమవుతుంది. హైదరాబాద్ నగర భూవివాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు, సిటీ సివిల్ కోర్టుల్లో నగర భూవివాదాల కేసుల సంఖ్య భారీగా ఉంది. చూడడానికి ఈ మొత్తం కేసుల సంఖ్య 5406. కానీ ఆ స్థలాల విలువ రూ.లక్ష కోట్ల పైమాటే. ఇందులోని అనేక వివాదాలు సీమాంధ్రుల ఆధిపత్యం అధికంగా ఉన్న షేక్‌పేట మండలం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు చెందినవే. ఈ ప్రాంతంలో భూమి అసలు వారసులు గుర్తించడం కష్టం. ఎవరిదో భూమి.. కానీ జీపీఏ ఇచ్చాడంటూ పత్రాలు. ఆ తర్వాత కోర్టులో కేసు. ఈలోగా ఏదో విధంగా పొజిషన్
ఒక్క షేక్‌పేటలోనే 1833 కేసులు
– లక్ష కోట్ల భూమి భవిష్యత్తు కోర్టుల్లో..
కోర్టుకెక్కి స్టే. ఇది ఇక్కడి భూబాగోతం. ఈ కేసుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషిస్తున్న నేతలుంటారు. ఒక్క షేక్‌పేట మండలంలోనే 1853 కేసులు ఉన్నాయంటే కబ్జాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతుంది. గజం స్థలం రూ.లక్షల్లో పలుకుతుండడంతో ప్రభుత్వ భూమి కనబడితే మాయమవుతోంది. అంగబలం, అర్ధబలం ఉన్న నేతలు, బడాబడా పారిశ్రామికవేత్తలు ఈ కేసుల వెనుక ఉన్నారు. నయానో భయానో బెదిరించి కనిపించింది కైంకర్యం చేయడం పరిపాటిగా మారింది. అందుకే షేక్‌పేట మండల తహసీల్దార్‌గా పనిచేయడం కత్తిమీద సాముగా మారిందని రెవెన్యూ అధికారులు లబోదిబో మంటున్నారు. విలువైన ఈ భూములపై కలెక్టర్ స్థానంలో ఉన్నవారు సైతం ధైర్యంగా అడుగులు వేయలేని దుస్థితి నెలకొంది. ఏ కేసులోనైనా శ్రద్ధ వహించినట్లు కనిపిస్తే మంత్రుల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ మంత్రి బంధువొకాయన 800 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్లాన్ వేశాడు. తహసీల్దార్ అధికారిక చర్యలకు ఉపక్రమించగానే బదిలీ ఉత్తర్వులు చేతికొచ్చాయి. ఇక్కడ ఇలాంటివి సర్వసాధారణమే.
ఇక్కడే ఎక్కు
నిజాం కొలువులో పని చేసిన అనేక మంది సైనిక చర్య సమయంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్, అరబ్ దేశాలకు వలస చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో వారి పేరుతో ఉన్న ఆస్తులన్నీ బొనా (వారసులు లేని) స్థలాలుగా గుర్తించారు. వాటిని సర్కారు స్థలాలుగా రికార్డులకెక్కించారు. అలాగే సర్ఫేకాస్, యూఎల్‌సీ, ఇతర ప్రభుత్వ భూములు ఇక్కడే ఎక్కువ. అయితే కొందరు అక్రమార్కులు ఆ స్థలాలు తమవేనంటూ నకిలీ పత్రాలు సృష్టించి సొంతం చేసుకున్నట్లు ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. కొందరు నిజాం తమకు కానుకగా ఇచ్చారని కూడా పత్రాలు తయారు చేయడం, నిజాం వారసులు అమ్మారని డాక్యుమెంట్లు చూపడం చేస్తూ కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది. ఇలాంటి బొనా స్థలాలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి తదితర ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. బొనా స్థలాలను గుర్తించి, సర్కారు ఖాతాలో జమ చేయడంలో అధికార యంత్రాంగం, పాలకులు విఫలమయ్యారు. పాలనా వ్యవహారాలు చూసే వారే వీటిని కైంకర్యం చేయడంలో పాత్రధారులుగా ఉన్నారని, దాంతో దిగువ స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయలేకపోయారని పదవీ విరమణ పొందిన రెవెన్యూ ఉద్యోగులు అభివూపాయపడుతున్నారు. కోర్టు కేసుల్లో వివరాలపై అధికారులు శ్రద్ధ వహించకుండా రాజకీయ జోక్యం అధికంగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అప్రమత్తంగా వ్యవహరించకపోతే..
నగరంలో ఉన్న ఈ 5406 భూ సంబంధ కేసుల్లో అనేకం సర్కారు భూములేనని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుల్లో నలుగుతున్న భూమి వేల ఎకరాల్లో ఉంది. అన్నీ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోనివే. ఎకరం రూ.50 కోట్ల దాకా పలికే భూములున్నాయి. వీటిని కాపాడేందుకు అంకితభావం కలిగిన ప్రభుత్వం అవసరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైతే ఈ భూములపై దృష్టి సారించవచ్చు. అయితే భూవ్యవహారాలను గవర్నర్‌కు అప్పగిస్తే కబ్జాలు యథాతథంగా మిగిలిపోవడం ఖాయం.
1954 ప్రాంతంలో.. నాటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ త్రివేదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటనలు చేసినపుడు అక్కడి ప్రజాప్రతినిధుల వైఖరి చూసి బాహాటంగానే అన్నాడు.. మీరు పెద్ద కజ్జాకోరులు.. ఉత్తి లిటిగెంటులని..! ఆ వ్యాఖ్యలు ఆనాడు పత్రికలకెక్కాయి కూడా! అదేం ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు.. సాక్షాత్తూ కందుకూరి వీరేశలింగం అంతటివాడిని.. కాటికి కాళ్లు చాపుకొన్న వయసులో కాకినాడ నుంచి మద్రాసుదాకా అనేక కోర్టుల మెట్లు ఎక్కించిన చరిత్ర సీమాంవూధులకు ఉంది. సమైక్యరాష్ట్రం పుణ్యమా అని ఆ వైభవం తెలంగాణకు కూడా చుట్టుకుంది..! హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ పాలనలో ఉన్న సమయంలోనే ఇక్కడకు వచ్చిపడ్డ సీమాంధ్ర అధికారులు, పోలీసుచర్యకు భయపడి పారిపోయినవారి ఆస్తులు కబ్జాలు పెట్టారు. వివాదాలు రేపి కోర్టులకెక్కారు.
చేతిలో పని కాబట్టి రికార్డులు మాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఇక అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దేశంలోఎక్కడా ఏ రాజధానిలో లేనన్ని భూవివాదాల కేసులు హైదరాబాద్‌లో చోటుచేసుకోవడం ఈ కబ్జాల పరంపర పుణ్యమే.
చెరువులోకి చేపల్లా ఈ నగరంలోకి పౌరులు చేరాలని నగర నిర్మాత కులీ కుతుబ్‌షా ఆశించారు. అయితే నాలుగు వందల ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో వలసాధిపత్యం పెరిగి భూములు ఇంతగా కబ్జా కేసుల్లో చిక్కుకుంటాయని ఆయన ఊహించి ఉండరు. నగరంలో భూములన్నీ తరిగిపోయి ఆఖరికి మనిషిని బొందపెట్టడానికి కూడా ఆరడుగుల జాగ దొరకని పరిస్థితి ఏర్పడింది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ చెరువు విస్తీర్ణం 549.32 హెక్టార్లు.
ఇప్పుడు ఆ జలాశయం చుట్టూ ఎన్ని నిర్మాణాలు, ఎవరి వాణిజ్య సముదాయాలు ఉన్నాయో అందరికీ ఎరుకే. రాష్ట్రంలో ఏ జిల్లా భూమి రికార్డులైనా దొరుకుతాయేమోగానీ, హైదరాబాద్‌లో మాత్రం అది అసాధ్యం. ఎంత వివక్షతో, ఎవరి కుట్రలతో ఇక్కడి భూమి కునారిల్లుతున్నదో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించిన తెలంగాణ ఇప్పుడు సంబురం చేసుకోనున్న తరుణంలోనూ సీమాంధ్ర లాబీయిస్టులు కేంద్రానికి ఇచ్చిన నివేదికల్లో ఎందుకు హైదరాబాద్‌ను చెరబట్టాలనుకుంటున్నారో కూడా అందరికీ తెలిసిపోతున్నది.

Posted on November 10, 2013
0

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు