కరోనా టెస్టులపై కేంద్రం ఆగ్రహం...బద్ నాం చేసేందుకేనా ?


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పాకేజిపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఘాటు విమర్శలకు కేంద్రం మరో రూటులో దిగిందా ? కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ బద్ నాం చేసేందుకే ఈ లేఖ రాసారా ?.అయితే ఈ లేఖ బిజెపి నాయకుల వత్తిడి మేరకే వచ్చి ఉంటుందనే అనుమానాలు కొట్టి పారేయ లేము. ఎందుకంటే కేంద్రం నుండి వచ్చి వెళ్ళిన పరిశీలకుల బృందం ఇక్కడ బాగా కరోనా కట్టడి జరుగుతోందని కితాబు ఇచ్చింది.

తెలంగాణ రాష్ర్టంలో కోరానా టెస్టులు జరుగుతున్న తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేసింది.ఈ మేరకు  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి గురువారం లేఖ రాశారు.ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. పరీక్షలు నిర్వహించకుండా కరోనాను కట్టడి చేయలేమని పేర్కొంది.ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని  లేఖలో పేర్కొంది. దేశంలో మిగతా రాష్ర్టాలలో పెద్ద ఎత్తున టెస్టులు జరుగుతుంటే తెలంగాణా లో కేవలం 22 వేల టెస్టులు మాత్రమే చేశారని అగ్రహం వ్యక్తం చేసింది.కేంద్రం లేఖను బట్టి చూస్తే తెలంగాణ రాష్ర్టంపై వత్తిడి పెంచేందుకే ఈ లేఖ రాసారని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా బిజెపి నాయకులు అనేక మంది ఎదురు దాడి చేసారు.సిఎం కెసిఆర్ కరోనా  టెస్టుల విషయంలో తప్పు చేస్తున్నట్లు చూపేందుకే కేంద్ర లేఖ రాసి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రం లేఖపై స్పందిస్తూ ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకే టెస్టులు జరుగుతున్నాయని తెలిపారు.టెస్టులు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు