బ్రెజిల్ అధ్యక్షుడి వీడియో కాన్ఫరెన్స్‌లో నగ్న దృశ్యం, స్నానం చేస్తూ..

కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా దేశాలలో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. అధికారులు సైతం ఇళ్ల‌లో నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా స‌మీక్ష‌లు జరుపుతున్నారు.‌ అయితే ఇలాంటి స‌మ‌యాల్లో కొన్ని చిత్ర‌విచిత్ర సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతున్నాయి. తాజాగా దేశాధ్య‌క్షునికి సైతం ఓ చేదు అనుభ‌వం ఎదురైంది.‌ వివ‌రాల్లోకి వెళితే..  క‌రోనా క‌ట్టడిలో భాగంగా అనుస‌రిస్తున్న లాక్‌డౌన్ ఫ‌లితాల‌పై చ‌ర్చిందుకు సావో పాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు పాలో స్కాఫ్ జూమ్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వ‌హించాడు. ఇందులో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్స‌నారోతో పాటు ప‌ది మంది ఇత‌ర అధికారులు కూడా పాల్గొన్నారు. ఇంత‌లోనే ఆ వీడియో కాల్‌లో ఓ వ్య‌క్తి న‌గ్నంగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు.

దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి పాలో గ్యూడెస్ స్పందిస్తూ.. ‘‘ఆ వీడియోలో ఓ వ్యక్తి నగ్నంగా స్నానం చేస్తున్నాడు. మీటింగ్ వేడి వేడిగా జరుగుతుండటంతో అతడు చన్నీటి స్నానం చేస్తున్నాడు’’ అని తెలిపారు. అయితే, ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే, క్షణాల్లో అది వైరల్‌గా మారింది. ఆ స్నానం చేసిన వ్యక్తి వాణిజ్యవేత్త అని తెలిసింది. అతను మీటింగులో వీడియోను ఆపడం మరిచిపోయి ఉంటాడని అధికారులు అంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు